నిగూఢ ఉద్దేశంతోనే.. ‘ట్రి–జంక్షన్‌’ పై చైనా | India Has 'Ulterior Motives' For Including Tri-Junction in Standoff, Says China | Sakshi
Sakshi News home page

నిగూఢ ఉద్దేశంతోనే.. ‘ట్రి–జంక్షన్‌’ పై చైనా

Jul 7 2017 11:48 PM | Updated on Sep 5 2017 3:28 PM

నిగూఢ ఉద్దేశంతోనే.. ‘ట్రి–జంక్షన్‌’ పై చైనా

నిగూఢ ఉద్దేశంతోనే.. ‘ట్రి–జంక్షన్‌’ పై చైనా

నిగూఢ ఉద్దేశంతోనే భారత్‌....సిక్కిం వివాదంలో ట్రి జంక్షన్‌ వివాదాన్ని చేర్చేందుకు భారత్‌ యత్నిస్తోందని చైనా శుక్రవారం ఆరోపించింది.

బీజింగ్‌/న్యూఢిల్లీ
నిగూఢ ఉద్దేశంతోనే భారత్‌....సిక్కిం వివాదంలో ట్రి జంక్షన్‌ వివాదాన్ని చేర్చేందుకు భారత్‌ యత్నిస్తోందని చైనా శుక్రవారం ఆరోపించింది. సరిహద్దు వివాదాలకు సంబంధించి 1890లో కుదిరిన చైనా–బ్రిటిష్‌ ఒప్పందాన్ని కాలం గడిచిపోయిందనే సాకుతో మార్చడానికి యత్నించకూడదంటూ హితవు పలికింది.

సరిహద్దు వివాదంపై 2012లో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తోందనే భారత్‌ ఆరోపణలపై ప్రశ్నించగా సిక్కింలో తాము నిర్మిస్తున్న రహదారికి, ఈ ఒప్పందానికి ఎటువంటి సంబంధమూ లేదని విదేశాంగ శాఖ మంత్రి గెంగ్‌ షువాంగ్‌ పేర్కొన్నారు.  

చైనా విషయంలో మౌనం ఎందుకు: రాహుల్‌
చైనా విషయంలో ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. సిక్కింలో భారత్‌తో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో చైనా కయ్యానికి కాలు దువ్వుతుండడం తెలిసిందే. ఇప్పటికే ఆదేశ సైనిక దళం టిబెట్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో యుద్దంలో ఎదురయ్యే పరిస్ధితులను కృత్రిమంగా సృష్టించుకుని కసరత్తు చేస్తోంది. ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా ప్రధాని మౌనం వహించడం ఏమిటిని రాహుల్‌ ట్వీటర్‌లో ప్రశ్నించాడు. తక్షణమే  ఉద్రిక్త పరిస్థితులు తొలిగిపోయేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement