న్యూఢిల్లీ, ముంబై ఘటనలు భారత పరువు తీశాయి | India dignity disappeared due to new delhi, mumbai gangrape cases, says sushma swaraj | Sakshi
Sakshi News home page

న్యూఢిల్లీ, ముంబై గ్యాంగ్ రేప్ ఘటనలు భారత పరువు తీశాయి

Aug 26 2013 12:24 PM | Updated on Sep 1 2017 10:08 PM

న్యూఢిల్లీ, ముంబై ఘటనలు భారత పరువు తీశాయి

న్యూఢిల్లీ, ముంబై ఘటనలు భారత పరువు తీశాయి

నిర్భయ, ఫోటో జర్నలిస్టులపై సామూహిక అత్యాచార సంఘటనలతో భారత ప్రతిష్ట మసకబారిందని లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ మండిపడ్డారు.

న్యూఢిల్లీలోని నిర్భయ, ముంబైలోని ఫోటో జర్నలిస్టులపై సామూహిక అత్యాచార సంఘటనలతో భారత ప్రతిష్ట మసకబారిందని లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ మండిపడ్డారు. సోమవారంలో లోక్సభలో ఫోటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటనపై జరిగిన చర్చ కార్యక్రమంలో ఆమె తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.


ఓ వైపు దేశంలో మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థానాలను ఆధిరోహిస్తున్నారన్నారు. మరోవైపు మహిళలపై దారుణ అకృత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ ఘటనపై ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె పేర్కొన్నారు. ముంబై, న్యూఢిల్లీ ఘటనలపై సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement