ఇండియా కాలింగ్: సత్య నాదెళ్ల కమింగ్ సూన్! | India calling: Microsoft head Satya Nadella to visit later this month | Sakshi
Sakshi News home page

ఇండియా కాలింగ్: సత్య నాదెళ్ల కమింగ్ సూన్!

Feb 4 2017 2:13 PM | Updated on Sep 5 2017 2:54 AM

ఇండియా కాలింగ్: సత్య నాదెళ్ల కమింగ్ సూన్!

ఇండియా కాలింగ్: సత్య నాదెళ్ల కమింగ్ సూన్!

టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల త్వరలో ఇండియా పర్యటనకు రానున్నారు.

ముంబై: టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల  త్వరలో  ఇండియా పర్యటనకు రానున్నారు. ఈ నెలలో ముంబై లో జరిగే  ఫ్యూచర్ డీకోడెడ్' సదస్సుకు  సత్య  నాదెళ్ల  రానున్నారు. భారతీయుడైన సత్య నాదెళ్ల  మైక్రోసాఫ్ట్ సీఈవోగా  ఇండియాలో అనేకసార్లు పర్యటించినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్  ఏడు ముస్లిందేశాలకు  చెందిన ముస్లిం ప్రజలపై ఆంక్షలు,ఆందోళనల నేపథ్యంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

మైక్రోసాఫ్ట్  ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21-22  తేదీల్లో  ముంబైలో జరగనున్న 'ఫ్యూచర్ డీకోడెడ్ ఈవెంట్'  లో  పాల్గొనన్నారు. దాదాపు 1,500 వ్యాపార  దిగ్గజాలు,  ప్రభుత్వ అధికారులు ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఎం 5మాజీ డైరెక్టర్ జనరల్ లార్డ్ జోనాథన్ ఎవాన్స్, టాటామెటార్స్  సీఈవో గుయెంటర్ బుశ్చెక్,  హావెల్స్  ఛైర్మన్ అనిల్ రాయ్ గుప్త తదితర బిజినెస్ టైకూన్లు ఈ ఈవెంట్కు హాజరుకానున్నారు. అయితే  సత్య నాదెళ్ల పర్యటన విరాలను  ఆయన  కార్యాలయ వర్గాలు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.


కాగా మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్  బ్రాడ్ స్మిత్ తో పాటు మరో 76 మంది సంస్థ ఉద్యోగులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్   ట్రావెల్ బ్యాన్ ను వ్యతిరేకించారు. వీరితో పాటు గూగుల్, యాపిల్,  నెట్ ఫ్లిక్స్,  ఫేస్ బుక్  తదితర అమెరికాన్ టాప్ కంపెనీలు   ట్రంప్  కార్వనిర్వాహక తాజా ఆదేశాలను  తప్పుబట్టాయి.  అటు అమెరికాలోని ఫెడరోల్ కోర్టు ట్రంప్ ఆదేశాలపై స్టే విధించిన సంగతి తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement