ఆ కంపెనీలకు పన్ను తగ్గిందోచ్! | Income tax for smaller companies with annual turn over up to 50 crore, reduced by 5% | Sakshi
Sakshi News home page

ఆ కంపెనీలకు పన్ను తగ్గిందోచ్!

Feb 1 2017 12:58 PM | Updated on Sep 27 2018 4:47 PM

ఆ కంపెనీలకు పన్ను తగ్గిందోచ్! - Sakshi

ఆ కంపెనీలకు పన్ను తగ్గిందోచ్!

చిన్న సంస్థలకు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఊరటనిచ్చారు.

చిన్న సంస్థలకు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఊరటనిచ్చారు. వారిపై వేసే పన్నుపై  5 శాతం తగ్గించారు. రూ.50 కోట్ల టర్నోవర్ వరకున్న కంపెనీలకు వేసే ఆదాయపు పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్టు జైట్లీ బడ్జెట్లో ప్రకటించారు. నల్లధనం నిర్మూలించడానికి పెద్దనోట్లను రద్దు చేయడంతో ఆర్థికవ్యవస్థ మందగించింది. డిమాండ్లో ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిన్న, మధ్యతరహా సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.
 
డిమాండ్పై పడిన ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు బడ్జెట్లో పలు పన్ను ప్రోత్సహకాలను ప్రవేశపెడతారని పలు రేటింగ్ సంస్థలు అంచనావేశాయి. ఈ మేరకు జైట్లీ ప్రకటన వెలువరిచారు. చిన్న సంస్థలపై విధించే ఆదాయపు పన్నును దశల వారీగా 25 శాతానికి తగ్గిస్తామని తెలిపారు.  చిన్న కంపెనీలపై తగ్గించిన పన్నుతో ప్రభుత్వానికి రూ.7200 కోట్ల రెవెన్యూ నష్టం నెలకొననుంది. 
Advertisement
 
Advertisement
Advertisement