
వికృత కామెంట్‌పై హీరోయిన్ మండిపాటు
ట్విట్టర్‌లో, సోషల్ మీడియాలో ట్రోల్ (వ్యక్తిగతంగా కించపరిచే దూషణల) బారిన పడటం సినీ తారలకు కొత్త కాదు.
ట్విట్టర్‌లో, సోషల్ మీడియాలో ట్రోల్ (వ్యక్తిగతంగా కించపరిచే దూషణల) బారిన పడటం సినీ తారలకు కొత్త కాదు. ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్, ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఇలియానాకు తాజాగా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఇలియానా తాజాగా ట్విట్టర్‌లో ఓ కథనాన్ని షేర్ చేసుకుంది. తనకు పంపిన మెసేజ్‌లు, నగ్న ఫొటోలు బయటపెడతానని ఓ అమ్మాయికి ఆమె మాజీ ప్రియుడు చేసిన బెదిరింపులను ఆమె ధైర్యంగా ఈ ఆర్టికల్‌లో బట్టబయలుచేసింది. ఈ హేయమైన పనిచేసిన వాడిని బహిర్గతం చేసి.. ఆ అమ్మాయి గొప్ప పని చేసిందని, ఆమెను చూస్తే గర్వంగా ఉందని ఇలియానా ట్వీట్ చేసింది.
తాను కూడా ఈవ్ టీజింగ్, వేధింపుల బాధితురాలినేనని, ఇది ఎంతో మానసిక క్షోభ కలిగిస్తుందని ఆమె తన అనుభవాన్ని గుర్తుచేసుకుంది. తనకు ఎంతోమంచి తల్లిదండ్రులు ఉన్నారని, వారు తనకు ఎంతో భరోసాను ఇచ్చారని పేర్కొంది. నిజానికి ఇక్కడితో ఈ అంశం ముగిసిపోవాలి. అయితే, ఇక్కడి నుంచే కొందరు నెటిజన్లు వెకిలి చేష్టలకు ప్రయత్నించారు. ఇంత అర్ధరాత్రి ఈ విషయం ఎందుకు గుర్తుకువచ్చిందని ఓ నెటిజన్ అడుగగా.. తాను ఇప్పుడు ఆ కథనాన్ని కాజువల్‌గా చదివానని, షేర్ చేసుకుంటే బాగుంటుందని అనిపించిందని ఇలియానా బదులిచ్చింది. ఇంతలో మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. లైంగికపరమైన నీచమైన కామెంట్ చేశాడు. అతని కామెంట్‌తో ఆగ్రహించిన ఇలియానా.. ఎంతటి మూర్ఖుడివి నువ్వు అంటూ ఘాటుగా బదులిచ్చింది.