ఆర్నెల్లకే బోనస్... రూ. 1.10 కోట్లు | iGATE CEO Vemuri to get over Rs 1cr as performance bonus | Sakshi
Sakshi News home page

ఆర్నెల్లకే బోనస్... రూ. 1.10 కోట్లు

Feb 11 2014 1:04 AM | Updated on Sep 2 2017 3:33 AM

ఆర్నెల్లకే  బోనస్... రూ. 1.10 కోట్లు

ఆర్నెల్లకే బోనస్... రూ. 1.10 కోట్లు

ఐగేట్ సీఈఓగా చేరి ఆరునెలలు కూడా కాకముందే అశోక్ వేమూరి ఏకంగా 1.70 లక్షల డాలర్ల (సుమరు రూ.1.10 కోట్లు) బోనస్‌ను అందుకోనున్నారు.

న్యూఢిల్లీ: ఐగేట్ సీఈఓగా చేరి ఆరునెలలు కూడా కాకముందే అశోక్ వేమూరి ఏకంగా 1.70 లక్షల డాలర్ల (సుమరు రూ.1.10 కోట్లు) బోనస్‌ను అందుకోనున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ కంపెనీ ఐగేట్‌లో ఆయన గతేడాది సెప్టెంబర్‌లో చేరారు. ఆయన అమలు చేసిన వ్యూహాత్మక చర్యలతో డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ ఆదాయం 10 శాతానికిపైగా పెరిగింది.

పనితీరు ఆధారంగా ఇచ్చే వార్షిక ప్రోత్సాహకం 1.47 లక్షల డాలర్లతో పాటు వ్యూహాత్మక చర్యలకు మరో 28 వేల డా లర్లను అశోక్ వేమూరికి ఇస్తున్నట్లు కంపెనీ సోమవారం వెల్లడించింది. 2012 అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికంలో 27.16 కోట్ల డాలర్లుగా ఉన్న ఐగేట్ ఆదాయం 2013లో ఇదే కాలంలో 10.2% వృద్ధితో 29.93 కోట్ల డాలర్లకు చేరింది. ఐదేళ్ల ఒప్పందంతో ఐగేట్‌లో చేరిన అశోక్ వేమూరి వార్షిక వేతనం 13 లక్షల డాలర్లు. నగదు బోనస్ అదనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement