-
నేను ఆ రేసులో లేను
సాక్షి, బెంగళూరు: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కు సీఈవో కానున్నారనే వార్తలపై కండ్యూయెంట్ సీఈవో డైరెక్టర్ అశోక్ వేమూరి(49) స్పందించారు. తాను ఇన్ఫీ సీఈవో రేసులో లేనని స్పష్టం చేశారు. అశోక్ వేమూరి ఇన్ఫీ సీఈవో కానున్నారన్న అంచనాలు ఇటీవల ఇండస్ట్రీ వర్గాల్లో క్కర్లుకొట్టాయి. ఈ నేపథ్యంలో ఈ అంచాలన్నీ అవాస్తవాలని తేల్చి పారేశారు. తాను కండ్యూయెంట్ కంపెనీకి కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను కండ్యూయెంట్ కంపెనీకి, ఖాతాదారులకు, షేర్ హోల్డర్స్, ఉద్యోగులకు పూర్తిగా నిబద్ధుడినై ఉన్నానని ప్రకటించారు. అద్భుతమైన ప్రయాణం మధ్యలో ఉన్నాం, అది వేగంగా అభివృద్ధి చెందే దిశలో ఉంది . ఈ విషయంలో తనకు బోర్డుతో సహా ఇతర ఖాతాదారులు, టీం మద్దతు ఉందని వెల్లడించారు. తన దీర్ఘ కాల ప్రయాణంలో ఉన్నానని, అది పూర్తి చేయాలని భావిస్తున్నానని ఆఫ్ క్రాస్ రీసెర్చ్ విశ్లేషకుడు షానోన్ క్రాస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతేకాదు ఇక్కడ (కండ్యూయెంట్) కంటే ఎక్కువ ఉత్తేజకరమైన, వృత్తిపరంగా సంతృప్తికరమైన స్థలం గురించి తాను ఆలోచించలేనని అశోక్ వేమూరి స్పష్టం చేశారు. కాగా ఇన్ఫోసిస్ సీఎండీగా విశాల్ సిక్కా రాజీనామా అనంతరం ఈ పదవిలో రేసులో ఉ న్న వారి పేర్లలో అశోక్ వేమూరి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యుడు కూడా వేమూరి 2013లో కంపెనీ వీడారు. -
ఆర్నెల్లకే బోనస్... రూ. 1.10 కోట్లు
న్యూఢిల్లీ: ఐగేట్ సీఈఓగా చేరి ఆరునెలలు కూడా కాకముందే అశోక్ వేమూరి ఏకంగా 1.70 లక్షల డాలర్ల (సుమరు రూ.1.10 కోట్లు) బోనస్‌ను అందుకోనున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కంపెనీ ఐగేట్‌లో ఆయన గతేడాది సెప్టెంబర్‌లో చేరారు. ఆయన అమలు చేసిన వ్యూహాత్మక చర్యలతో డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ ఆదాయం 10 శాతానికిపైగా పెరిగింది. పనితీరు ఆధారంగా ఇచ్చే వార్షిక ప్రోత్సాహకం 1.47 లక్షల డాలర్లతో పాటు వ్యూహాత్మక చర్యలకు మరో 28 వేల డా లర్లను అశోక్ వేమూరికి ఇస్తున్నట్లు కంపెనీ సోమవారం వెల్లడించింది. 2012 అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికంలో 27.16 కోట్ల డాలర్లుగా ఉన్న ఐగేట్ ఆదాయం 2013లో ఇదే కాలంలో 10.2% వృద్ధితో 29.93 కోట్ల డాలర్లకు చేరింది. ఐదేళ్ల ఒప్పందంతో ఐగేట్‌లో చేరిన అశోక్ వేమూరి వార్షిక వేతనం 13 లక్షల డాలర్లు. నగదు బోనస్ అదనం. -
ఇన్ఫీలో మళ్లీ మూర్తి మేజిక్!
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు ‘నారాయణ’ మంత్రం బాగానే పనిచేస్తోంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నారాయణ మూర్తి పునరాగమనం తర్వాత ఇన్ఫీ వరుసగా రెండో క్వార్టర్లోనూ మెరుగైన ఫలితాలు సాధించింది. అంతేకాక.. ఆదాయ వృద్ధి అంచనాలను(గెడైన్స్) రెండోసారి పెంచడం దీనికి తార్కాణమని విశ్లేషకులు అంటున్నారు. మూర్తి పగ్గాలు చేపట్టాక 8 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని వీడటం... ఒకరకంగా షాక్‌గు గురిచేసినా.. ఫలితాలపై దీని ప్రభావం ఏమాత్రం లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా... ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఇన్ఫీ షేరు ఏమాత్రం చెక్కుచెదరకుండా ఆల్‌టైమ్ గరిష్టస్థాయిలోనే కొనసాగుతుండటం కూడా నారాయణ మూర్తి పునరాగమన శుభసూచకమేనన్న వాదనలకు బలం చేకూరుస్తోంది. మైసూర్: ఐటీ అగ్రగామి ఇన్ఫోసిస్ అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. ఈ ఏడాది డిసెంబర్ క్వార్టర్(2013-14, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 21.4 శాతం వృద్దితో రూ.2,875 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 2,369 కోట్లుగా నమోదైంది. మరోపక్క, మొత్తం ఆదాయం కూడా రూ. 13,026 కోట్లకు పెరిగింది. గత క్యూ3లో రూ. 10,424 కోట్ల లాభంతో పోలిస్తే 25 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా అ మెరికాలో ఆర్థిక వ్యవస్థ రికవరీతో ఐటీ సేవలకు డిమాండ్ పుంజుకుంటుండటం.. యూరప్‌లో ఆఫ్‌షోర్ అవుట్‌సోర్సింగ్‌పై పెరుగుతున్న ఆసక్తితో దేశీ ఐటీ కంపెనీలకు కొలిసొచ్చే అంశంగా నిలుస్తోంది. మరోపక్క, డాలరుతో రూపాయి మారకం విలువ భారీ పతనం కూడా ఆదాయాల్లో వృద్ధికి తోడ్పాటునందిస్తున్న అంశాల్లో ఒకటి. సీక్వెన్షియల్‌గా కూడా... 2013-14 సెప్టెంబర్(క్యూ2)తో పోలిస్తే... సీక్వెన్షియల్‌గా క్యూ3లో నికర లాభం 19.4 శాతం దూసుకెళ్లడం విశేషం. క్యూ2లో లాభం రూ.2,407 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం సీక్వెన్షియల్‌గా 0.5 శాతం వృద్ధితో రూ.12,965 కోట్ల నుంచి రూ.13,026 కోట్లకు పెరిగింది. కాగా, పలు బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు సగటున రూ.2,752 కోట్ల నికర లాభాన్ని, రూ.13,055 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. గెడైన్స్ జూమ్... వరుసగా రెండో క్వార్టర్లో కూడా ఇన్ఫీ గెడైన్స్‌ను పెంచింది. 2013-14 పూర్తి ఏడాదికి డాలర్ రూపంలో ఆదాయ వృద్ధి 11.4-12 శాతంగా ఉండొచ్చని క్యూ3 ఫలితాల సందర్భంగా ప్రకటించింది. విశ్లేషకులు 11-12 శాతం గెడైన్స్‌ను అంచనా వేశారు. కాగా, సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల్లో డాలర్ ఆదాయ గెడైన్స్‌ను ఇన్ఫీ 9-10 శాతానికి పెంచడం(అంతక్రితం అంచనా 6-10%) గమనార్హం. ఇక రూపాయి ప్రాతిపదికన కూడా ఇన్ఫీ ఈ ఏడాది గెడైన్స్‌ను మరోసారి పెంచింది. ఆదాయ వృద్ధి 24.4-24.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది(డాలరుతో రూపాయి మారకం విలువను 61.81గా పరిగణనలోకి తీసుకుంది). క్యూ2లో ఈ గెడైన్స్‌ను 13-17 శాతం స్థాయి నుంచి 21-22 శాతానికి పెంచడం తెలిసిందే. ఉద్యోగులు తగ్గారు... డిసెంబర్ క్వార్టర్లో స్థూలంగా 6,682 మంది సిబ్బందిని ఇన్ఫీ, దాని అనుబంధ సంస్థలు నియమించుకున్నాయి. అయితే, 8,505 మంది కంపెనీని వీడారు. అంటే నికరంగా నియామకాలేవీ లేకపోగా... 1,823 మంది కంపెనీని వీడారు. డిసెంబర్ 31 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య తొలిసారిగా తగ్గుముఖంపట్టి 1,58,404కు చేరింది. సెప్టెంబర్ చివరికి సిబ్బంది సంఖ్య 1,60,227గా ఉంది. ఉద్యోగుల వలసల(అట్రిషన్ రేటు) 18.1 శాతానికి పెరగడం(క్యూ2లో 17.3%-గత క్యూ3లో 15.1%) గమనార్హం. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... అక్టోబర్-డిసెంబర్(క్యూ3) మూడు నెలల కాలంలో అనుబంధ సంస్థలతో కలసి ఇన్ఫోసిస్ మొత్తం 54 కొత్త క్లయింట్లను సంపాదించింది. ఈ ఏడాది క్యూ2లో కొత్త క్లయింట్ల సంఖ్య 68 కాగా, గతేడాది క్యూ3లో 89గా ఉంది. డిసెంబర్ 31 నాటికి ఇన్ఫీ వద్ద నగదు, తత్సంబంధ నిల్వలు రూ.27,440 కోట్లకు పెరిగాయి. క్యూ2లో ఇది రూ.26,907 కోట్లు. యూబీ ప్రవీణ్ రావును అదనపు, హోల్‌టైమ్ డెరైక్టర్‌గా, కిరణ్ మజుందార్ షాను స్వతంత్ర డెరైక్టర్‌గా నియమిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. తక్షణం ఈ నియామకాలు అమల్లోకి వస్తాయి. మాజీ సీఎఫ్ఓ, డెరైక్టర్ వి. బాలకృష్ణన్ గత నెలలో(డిసెంబర్ 31 నుంచి అమలు) ఇన్ఫీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మెరుగైన ఫలితాలు, గెడైన్స్ పెంపులో ఇన్ఫీ షేరు లాభాల జోరును కొనసాగించింది. శుక్రవారం బీఎస్ఈలో రూ.3,575 స్థాయిని తాకింది. చివరకు 2.84% లాభంతో రూ.3,549 వద్ద ముగిసింది. ఇక మంచిరోజులే...: శిబులాల్ ఐటీ పరిశ్రమకు ఈ ఏడాది నుంచి ఇక మంచిరోజులు రానున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతుండటంతో మా క్లయింట్లకు ఐటీ సేవలపై పెట్టుబడుల విషయంలో విశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తోందని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్ పేర్కొన్నారు. ‘సంస్థాగతంగా కంపెనీలో ఇటీవల చేపట్టిన కొన్ని మార్పులు మార్కెట్ వాటాను పెంచుకోవడం, క్లయింట్లతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో తోడ్పడనున్నాయి. కొంతమంది ఉన్నతోద్యోగులకు ఇన్ఫోసిస్‌లో కంటే మరింత ఉన్నతమైన అవకాశాలు, ఆశయాలు ఉండొచ్చు. అందుకే వాళ్లు కంపెనీని వీడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. వైదొలగడం వాళ్లకు మంచిదే: మూర్తి ఇటీవల మేం చేపట్టిన పలు మార్పులు, చర్యల సానుకూల ఫలితాలు రానున్న కాలంలో కచ్చితంగా కనబడతాయి. ఈ విషయంలో ఇన్ఫీ ఉద్యోగులందరిలోనూ సంపూర్ణ విశ్వాసం ఉందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ఆర్ నారాయణ మూర్తి చెప్పారు. ఆయన పునరాగమనం తర్వాతే చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వరుసగా వైదొలగుతున్నారన్న ప్రశ్నకు... ‘ఇది వాళ్లకూ, కంపెనీకి కూడా మంచిదే’ అని సమాధానమిచ్చారు. కొత్త ప్రెసిడెంట్లుగా నియమించిన బీజీ శ్రీనివాస్, యూబీ ప్రవీణ్ రావులకు తమ కొత్త బాధ్యతల్లో నిలదొక్కుకోవడానికి కొంత సమయమిస్తామని కూడా మూర్తి పేర్కొన్నారు. -
'ఐగేట్' సీఈవోగా అశోక్ వేమూరి
ఐగేట్ టెక్నాలజీ నూతన అధ్యక్షుడు, కార్యనిర్వహాణాధికారిగా అశోక్ వేమూరి నియమితులైయ్యారు. ఈ మేరకు ఐ గేట్ టెక్నాలజీ సహా వ్యవస్థాపకుడు సునీల్ వాద్వానీ గురువారం ఇక్కడ వెల్లడించారు. అశోక్ తన పదవి భాద్యతలు సెప్టెంబర్ 16న స్వీకరిస్తారని తెలిపారు. కాగా ఐగేట్ టెక్నాలజీ సీఈవోగా పని చేసిన పణీష్ మూర్తి సహద్యోగితో అక్రమ సంబంధం నెరపాడని అభియోగం వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే మాసంలో పణీష్కు ఐగేట్ ఉద్వాసన పలికింది. దాంతో ఆ కంపెనీ తత్కాలిక పదవి బాధ్యతలను గెహర్డ్ వజినర్కు అప్పగిస్తున్నట్లు ఐగేట్ టెక్నాలజీ ప్రకటించింది. గతంలో సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో విధులు నిర్వర్తించిన అశోక్ వేమూరి అనంతరం ఐ గేట్ టెక్నాలజీలో ప్రవేశించారు. -
ఇన్ఫోసిస్‌కు అశోక్ వేమూరి గుడ్‌బై
బెంగళూరు: ఇన్ఫోసిస్ టాప్ మేనేజ్మెంట్లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా బోర్డు సభ్యుడు అశోక్ వేమూరి రాజీనామా చేశారు. ఉత్తర అమెరికాలో తయారీ విభాగం రీజనల్ హెడ్‌గా ఉన్న సంజయ్ జలోనా ఇకపై వేమూరి స్థానంలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ గ్లోబల్ హెడ్‌గా బాధ్యతలు చేపడతారని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలో ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపార విభాగం హెడ్‌గా చతుర్వేది వైదొలిగిన వారం రోజుల్లోగానే వేమూరి రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్ఫీ గ్లోబల్ సేల్స్‌హెడ్ వాసవ్ గత నెలలోనే వైదొలిగారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement