బిల్డర్స్కు ఐటీ షాక్! | I-T conducts countrywide survey on builders | Sakshi
Sakshi News home page

బిల్డర్స్కు ఐటీ షాక్!

Nov 19 2016 11:41 AM | Updated on Sep 4 2017 8:33 PM

బిల్డర్స్కు ఐటీ షాక్!

బిల్డర్స్కు ఐటీ షాక్!

పెద్ద నోట్ల రద్దు అనంతరం జువెల్లరీ వ్యాపారులను, బులియన్ ట్రేడర్స్ను, హవాలా ఆపరేటర్లను టార్గెట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ప్రస్తుతం బిల్డర్స్కు షాకిస్తోంది.

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం జువెల్లరీ వ్యాపారులను, బులియన్ ట్రేడర్స్ను, హవాలా ఆపరేటర్లను టార్గెట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ప్రస్తుతం బిల్డర్స్కు షాకిస్తోంది. దిగ్గజ బిల్డర్స్, వారి కమిషన్ ఏజెంట్లు రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను అంగీకరిస్తున్నారని ఇంటిలిజెన్స్ రిపోర్టులో తేలడంతో వారిపై కొరడా ఝళిపించడానికి సిద్దమైంది. తాజా ప్రాపర్టీ డీల్స్లో బిల్డర్స్ ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడైంది. దీంతో దేశవ్యాప్తంగా బిల్డర్స్పై ఐటీ సర్వే చేపడుతోంది.

ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, మీరట్, అలహాబాద్, లక్నో, కోల్కత్తా, మధ్యప్రదేశ్లోని మరికొన్ని సిటీలోని పెద్ద బ్రోకింగ్ హైసింగ్స్పై  రైడ్స్ నిర్వహిస్తోంది. పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనంతరం వారి చేతుల్లో కలిగి ఉన్న నగదు, అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆధారాలను రాబడుతోంది. పెద్దనోట్ల రద్దుకు ముందు చాలామంది బిల్డర్స్ ఫండ్స్ను సేకరించడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. కనీసం గడువు సమయానికి ఫ్లాట్ కట్టేసి, కొనుగోలు దారుడి చేతులోకి ఇ‍వ్వడానికి ఆపసోపాలు పడేవారు. బిల్డర్స్పై  ఇప్పటికే పలు కేసులు కోర్టులో ఫైల్ అయి, విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. కొంతమందికి కోర్టు జరిమానాలు కూడా పడ్డాయి.

కానీ రద్దు అనంతరం పరిణామాలతో బంగారు వర్తకుల వల్లే, వీరి వద్ద కూడా రద్దు అయిన కరెన్సీ పెరుగుతోందని ఇంటలిజెన్స్ రిపోర్టులో వెల్లడైంది. వెనువెంటనే వారి కంట్రక్షన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఒకవేళ ప్రాజెక్టు ధర రూ.100 కోట్లు అయితే, బిల్డర్ చాలా తేలికగా రూ.10-15 కోట్ల నగదును చేతుల మీదనే నడిపిస్తున్నాడనని తెలిసింది. అదేవిధంగా నోట్ల రద్దుకు ముందు ప్రాపర్టీ అమ్మకం ద్వారా వచ్చిన నగదును సర్దుబాటు చేసుకుంటున్నారని తేలింది. గత మూడు రోజులుగా నోయిడా ఆధారిత దిగ్గజ బిల్డర్పై, మరో ఇద్దరి బిల్డర్స్పై ఐటీ అధికారులు జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఈ సర్వేలో బెంగళూరు ఆధారిత బిల్డర్ నుంచి రూ.12 కోట్ల లెక్కలో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారులు చెప్పారు. వాటిలో రూ.3.5 కోట్లు నగదు, రూ.45 లక్షల విలువైన బులియన్ బిల్డర్ దగ్గర లభ్యమైనట్టు చెప్పారు. నవంబర్ 8న ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అనంతరం బ్లాక్మనీ కలిగిఉన్న వారికి జువెల్లరీ వ్యాపారులు, హవాలా ఆపరేటర్లు, బిల్డర్స్ సహకరిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఐటీ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా వారిపై సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెవెన్యూ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు, ఐటీ డిపార్ట్మెంట్కు సహకరిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement