క్రికెటర్ భార్యా భర్తలు చెరో దారి! | I did not quit bjp, clarifies navjot kaur siddhu | Sakshi
Sakshi News home page

క్రికెటర్ భార్యా భర్తలు చెరో దారి!

Jul 19 2016 11:45 AM | Updated on Sep 4 2017 5:19 AM

క్రికెటర్ భార్యా భర్తలు చెరో దారి!

క్రికెటర్ భార్యా భర్తలు చెరో దారి!

తన భర్త అటు రాజ్యసభ సభ్యత్వంతో పాటు బీజేపీకి కూడా రాజీనామా చేశారని చెబుతున్న సిద్ధూ భార్య నవ్జోత్ కౌర్ సిద్ధూ.. తాను మాత్రం బీజేపీని వీడలేదని స్పష్టం చేశారు.

వాళ్లిద్దరూ భార్యాభర్తలు. అందులో భర్త ఒకప్పుడు బ్రహ్మాండంగా సిక్సర్లు బాది భారతజట్టుకు విజయాలు అందించిన క్రికెటర్. అలవోకగా ఎడాపెడా బాదేసేవాడు.. తర్వాత తనదైన శైలిలో కామెంట్రీ చెప్పడం ద్వారా ఇటీవలి కాలంలో అందరికీ దగ్గరయ్యాడు. ఆయనే.. నవ్జోత్ సింగ్ సిద్ధూ. కమెడియన్ కపిల్ శర్మ నిర్వహించే ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోలో కూడా తనదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు. తాజాగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆయన ఒక్కసారిగా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.

తన భర్త అటు రాజ్యసభ సభ్యత్వంతో పాటు బీజేపీకి కూడా రాజీనామా చేశారని చెబుతున్న సిద్ధూ భార్య నవ్జోత్ కౌర్ సిద్ధూ.. తాను మాత్రం బీజేపీని వీడలేదని స్పష్టం చేశారు. తన భర్త పంజాబ్ అభివృద్ధి కోసం కష్టపడాలని అనుకుంటున్నారని ఆమె చెప్పారు. ఆయన నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు తప్ప తాను ఏమీ చెప్పలేనని.. ఆయన ఏం చేసేదీ ఆయననే చెప్పనివ్వాలని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో సిద్ధూ చేరతారా లేదా అనే విషయాన్ని మాత్రం ఆమె నిర్ధారించలేదు. పంజాబ్కు సేవ చేయాలన్న స్పష్టత ఆయనకుందని, పంజాబ్ తప్ప మరో ఆప్షన్ ఆయనకు ఏమీ లేదని అన్నారు. అయితే... సిద్ధూతో పాటు ఆయన భార్య కూడా ఆమ్ ఆద్మీ పార్టీలోకి వస్తే తాము సాదరంగా స్వాగతిస్తామని ఆప్ నేత భగవంత్ మాన్ చెప్పారు.

ప్రస్తుతం నవ్జోత్ కౌర్ సిద్ధూ అమృతసర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకపక్క తాను బీజేపీకి రాజీనామా చేయలేదని చెబుతూనే.. అకాలీదళ్- బీజేపీ సర్కారుపై ఆమె విమర్శలు గుప్పించారు. పంజాబ్ అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, రాష్ట్రానికి ఆమ్ ఆద్మీ పార్టీయే సరైన ప్రత్యామ్నాయమని చెప్పారు. ఎన్నికల్లో పెద్దపెద్ద హామీలిచ్చినా, ఆ మేరకు పెట్టుబడులు ఏమీ రాలేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement