'భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు' | I am eternally grateful to the Indian Government: Adnan Sami | Sakshi
Sakshi News home page

'భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు'

Jan 1 2016 12:19 PM | Updated on Sep 3 2017 2:55 PM

'భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు'

'భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు'

భారత ప్రభుత్వానికి రుణపడివుంటానని పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీ అన్నారు.

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి రుణపడివుంటానని పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీ అన్నారు. ఇక్కడి ప్రజలు తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపుతున్నారని చెప్పారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున భారత ప్రభుత్వం తనకు విలువైన, అందమైన కానుక ఇచ్చిందని పేర్కొన్నారు.

శుక్రవారం ఆయన తన భార్యతో కలిసి హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజును కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత పౌరసత్వం పత్రాలను సమీకి మంత్రి అందజేశారు. జనవరి 1న భారత పౌరసత్వ పత్రాలు అందుకోవడం పట్ల సమీ సంతోషం వ్యక్తం చేశారు. వీటిని స్వీకరించాడని ఇంతకమన్న మంచిరోజు ఉందని వ్యాఖ్యానించారు.

మానవతా దృక్పథంతో అద్నాన్ సమీకి భారత పౌరసత్వం ఇచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. లాహోర్ లో జన్మించిన సమీ తొలిసారిగా 2001లో మార్చిలో భారత్ కు వచ్చారు. అప్పట్నుంచి వీసా మీద భారత్ కు వస్తూపోతూ గత కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. కాగా, మే 26న అతడి పాస్ పోర్టు గడువు తీరిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement