సూప్ చాలెంజ్.. | Hot Soup Challenge | Sakshi
Sakshi News home page

సూప్ చాలెంజ్..

Feb 14 2014 12:07 AM | Updated on Apr 4 2019 3:25 PM

సూప్ చాలెంజ్.. - Sakshi

సూప్ చాలెంజ్..

ఇక్కడ పెద్ద గిన్నెలో సూప్ ముందేసుకుని కూర్చున్న ఈయన ‘ఫూ’ చాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు.

ఇక్కడ పెద్ద గిన్నెలో సూప్ ముందేసుకుని కూర్చున్న ఈయన ‘ఫూ’ చాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ఫూగార్డెన్ రెస్టారెంట్‌కు స్థానికంగా చాలా పేరుంది. ఇక్కడ ఎవరైనా సరే ఈ ఫూ సూప్ సవాల్‌కు సిద్ధమవ్వొచ్చు. 1.8 కిలోల నూడుల్స్, 1.8 కిలోల గొడ్డు మాంసంతో దీన్ని తయారుచేస్తారు. గంటలోపే ఈ ఫూ సూప్‌ను బ్రేవ్‌మనిపిస్తే.. సూప్ ఖరీదు రూ.1,400 కట్టాల్సిన పని ఉండదు. అంతేకాదు.. ఓ జ్ఞాపికనూ అందిస్తారు.

 

అయితే, 2008లో ఈ రెస్టారెంట్ పెట్టినప్పటి నుంచి రోజూ పదుల సంఖ్యలో జనం ఈ చాలెంజ్‌కు సిద్ధమవుతున్నా.. ఇప్పటివరకూ ఈ సూప్‌ను పూర్తిగా ఖాళీ చేసినవారి సంఖ్యను వేళ్ల మీద లెక్కగట్టవచ్చట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement