బుజ్జాయికి జన్మనిచ్చిన ప్రముఖ సింగర్స్! | hemachandra, sravanabhargavi couple born a child | Sakshi
Sakshi News home page

బుజ్జాయికి జన్మనిచ్చిన ప్రముఖ సింగర్స్!

Jul 2 2016 7:42 PM | Updated on Oct 17 2018 3:53 PM

ప్రముఖ గాయకులైన హేమచంద్ర, శ్రావణ భార్గవి దంపతులు పండంటి బుజ్జాయికి జన్మనిచ్చారు.

హైదరాబాద్‌: ప్రముఖ గాయకులైన హేమచంద్ర, శ్రావణ భార్గవి దంపతులు పండంటి బుజ్జాయికి జన్మనిచ్చారు. శ్రావణభార్గవి శనివారం (జూన్ 2న) ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు హేమచంద్ర.

‘మాకు పాప పుట్టింది.. ఇప్పుడు నేను ఇద్దరు అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి..’ అని పేర్కొంటూ.. భార్య శ్రావణ భార్గవి, పాపాయితో కలిసి దిగిన ఫొటోను పోస్టుచేశాడు. చక్కగా సినిమా పాటలు పాడుతూ అభిమానుల అలరిస్తున్న హేమచంద్ర, శ్రావణ భార్గవి ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement