సంచలనం రేపుతున్న సుష్మ ఫోటో | Have you seen this rare image shared by Sushma Swaraj on her wedding anniversary? | Sakshi
Sakshi News home page

సంచలనం రేపుతున్న సుష్మ ఫోటో

Jul 13 2016 4:40 PM | Updated on Sep 4 2017 4:47 AM

సంచలనం రేపుతున్న సుష్మ ఫోటో

సంచలనం రేపుతున్న సుష్మ ఫోటో

ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్యాబినెట్ లో చురుకైన మంత్రిగా తనదైన పేరు గడించిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ఒక అపురూపమైన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి  నరేంద్రమోదీ క్యాబినెట్ లో చురుకైన  మంత్రిగా తనదైన పేరు గడించిన కేంద్ర  విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ఒక అపురూపమైన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. బీజేపీ సీనియర్ నాయకురాలైన సుష్మ బుధవారం తమ  వివాహ వార్షికోత్సవం సందర్భంగా పెళ్లినాటి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.  ఈ సందర్భంగా తమకు శుభాకాంక్షలు చెప్పిన  వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  మరి  ఈ సందర్భంగా మనం కూడా   లెట్స్ విష్  దెమ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ..

కాగా  సుష్మ భర్త, మాజీ ఎంపీ స్వరాజ్ కౌషల్  సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఆయన గతంలో మిజోరాం గవర్నర్ గా పనిచేశారు. 1998-2004  కాలంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement