ఫొటోకు దండ వేసేస్తాం.. జాగ్రత్త! | Harish salve gets garland threat from gangster ravi pujari | Sakshi
Sakshi News home page

ఫొటోకు దండ వేసేస్తాం.. జాగ్రత్త!

Oct 17 2015 10:06 AM | Updated on Sep 3 2017 11:06 AM

ఫొటోకు దండ వేసేస్తాం.. జాగ్రత్త!

ఫొటోకు దండ వేసేస్తాం.. జాగ్రత్త!

జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి కేసులు వాదించే ఖరీదైన న్యాయవాదిగా పేరున్న హరీష్ సాల్వేకు మాఫియా డాన్ రవి పూజారి నుంచి బెదిరింపులు వచ్చాయి. 'ఫొటోకు దండ వేసేస్తాం జాగ్రత్త' అని బెదిరించినట్లు తెలుస్తోంది.

జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి కేసులు వాదించే ఖరీదైన న్యాయవాదిగా పేరున్న హరీష్ సాల్వేకు మాఫియా డాన్ రవి పూజారి నుంచి బెదిరింపులు వచ్చాయి. 'ఫొటోకు దండ వేసేస్తాం జాగ్రత్త' అని బెదిరించినట్లు తెలుస్తోంది. ఆయన కార్యాలయానికి +61 (ఆస్ట్రేలియా) నెంబరు నుంచి ఫోన్ వచ్చిందని, అయితే ఆ సమయానికి ఆయన వేరే దేశంలో ఉన్నారని చెబుతున్నారు. అయితే ఇది జరిగిందని గానీ, జరగలేదని గానీ సాల్వే కార్యాలయ వర్గాలు నిర్ధారించడంలేదు. చాలాకాలంగా ఆస్ట్రేలియాలో దాగున్న రవి పూజారి ఢిల్లీలో ఓ ప్రముఖుడిని బెదిరించడం ఇదే మొదటిసారి. ఎక్కువగా ముంబైలోనే అతడి కార్యకలాపాలు కొనసాగేవి.

ఈ కాల్ ఆస్ట్రేలియాలోని న్యూకేజిల్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని బట్టి రవి పూజారి ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర హోంశాక, విదేశీ వ్యవహారాల శాఖలకు కూడా సమాచారం అందించారు. రవి పూజారి భార్య పద్మ, 14 ఏళ్ల కొడుకు గత సంవత్సరం ముంబై ఎయిర్పోర్టులో పట్టుబడ్డారు. అదే సమయంలో జమాయిత్ ఉల్ ఉలేమా లీగల్ సెల్ కార్యదర్శి గుల్జార్ అజ్మీని బెదిరించినందుకు రవిపూజారిపై ఎఫ్ఐఆర్ కూడా దాఖలైంది.

Advertisement
 
Advertisement
Advertisement