విమాన ప్రయాణీకులకు శుభవార్త! | Hand bag tag stamping may soon be done away with at Indian airports | Sakshi
Sakshi News home page

విమాన ప్రయాణీకులకు శుభవార్త!

Dec 15 2016 3:07 PM | Updated on Sep 4 2017 10:48 PM

విమాన ప్రయాణీకులకు శుభవార్త!

విమాన ప్రయాణీకులకు శుభవార్త!

విమాన ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగుల స్టాంపింగ్, ట్యాగింగ్ సమస్యలకు గాను సివిల్ ఏవియేషన్ బ్యూరో ఒక కొత్త పైలట్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టింది.

న్యూఢిల్లీ: విమానం ప్రయాణం అంటే లగేజీ స్కానింగ్..హ్యాండ్ బ్యాగుల సెక్యూరిటీ తనిఖీలు ఓ పెద్ద తతంగం. అయితే ఇక విమాన ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగుల స్టాంపింగ్, ట్యాగింగ్ సమస్యలకు ఇక శుభం కార్డు పడినట్టే.  ఈ మేరకు సివిల్ ఏవియేషన్ బ్యూరో ఒక కొత్త పైలట్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టింది.  
దేశవ్యాప్తంగా  విమానాశ్రయాల పూర్తి భద్రతను నిర్వహించే సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (బీసీఏఎస్)   అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చెకింగ్ వ్యవస్థను గురువారం ప్రారంభించింది.  హై రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు, సంబంధిత ఇతర టెక్నాలజీతో సహాయంతో    హ్యాండ్ బ్యాగుల తనిఖీని మరింత కట్టుదిట్టంగా చేపట్టనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోలకతా, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో  ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) ఈ ప్రక్రియను  మొదలు పెట్టింది.  ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఈ పద్ధతిని అన్ని విమానాశ్రయాల్లో ప్రారంభించనున్నట్టు  సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
సామాను భద్రత,  స్క్రీనింగ్  సౌకర్యాన్ని బలోపేతం చేయడానికి,  ప్రయాణీకులకు హ్యాండ్ బ్యాగు  టాగ్స్ , స్టాంపింగ్  కష్టాలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.  అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ పద్థతిని అవలంబిస్తున్నట్టు చెప్పింది.   బాధ్యత బీసీఏఎస్ ది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement