‘ఇస్రో యాంత్రిక్స్’పై హ్యాకర్ల దాడి | Hackers attack on ISRO antrix Corporation Limited | Sakshi
Sakshi News home page

‘ఇస్రో యాంత్రిక్స్’పై హ్యాకర్ల దాడి

Jul 13 2015 2:16 AM | Updated on Sep 3 2017 5:23 AM

‘ఇస్రో యాంత్రిక్స్’పై హ్యాకర్ల దాడి

‘ఇస్రో యాంత్రిక్స్’పై హ్యాకర్ల దాడి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేశారని ఆదివారం సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జె.ప్రసన్న వెల్లడించారు.

చెన్నై: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేశారని ఆదివారం సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జె.ప్రసన్న వెల్లడించారు. 2 రోజుల క్రితం వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారని, దీంతో యాంత్రిక్స్ తన వెబ్‌సైట్‌ను నిలిపివేసిందన్నారు.

హ్యాకింగ్‌లో చైనా హ్యాకర్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోందన్నారు. 2011లోనూ ఈ వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడిచేసినా.. ఆ కంపెనీ సరైన భద్రతా చర్యలు తీసుకోవడం లేదన్నారు. వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తున్నామని, వార్షిక నివేదికలను అప్‌లోడ్ చేస్తామని శుక్రవారం యాంత్రిక్స్ చైర్మన్ వీఎస్ హెగ్డే వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement