25 మంది పోలీసులపై వేటు | Gopalganj illicit liquor deaths: SP suspends 25 policemen | Sakshi
Sakshi News home page

25 మంది పోలీసులపై వేటు

Aug 19 2016 8:50 AM | Updated on Nov 6 2018 8:51 PM

బిహార్లోని గోపాల్గంజ్ ప్రాంతంలో 16 మంది వ్యక్తులు అక్రమ మద్యానికి బలైన ఘటనలో 15 మంది పోలీసులపై వేటు పడింది.

బిహార్లోని గోపాల్గంజ్ ప్రాంతంలో 16 మంది వ్యక్తులు అక్రమ మద్యానికి బలైన ఘటనలో 25 మంది పోలీసులపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. ఘటనకు బాధ్యులైన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా 14 మందిపై ఎఫ్ఐఆర్ను నమోదుచేశారు. పూర్తిగా మద్యం అమ్మకాల నిషేధం ఉన్న ఈ రాష్ట్రంలో, పోలీసుల నిర్లక్ష్యపూరిత వ్యవహారానికి అక్రమమద్య వ్యాపారం కొన్ని ప్రాంతాల్లో జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గోపాల్గంజ్ జిల్లా స్థానిక ప్రాంతంలో మంగళవారం సాయంత్రం అక్రమ మద్యం సేవించి 16 మంది వ్యక్తులు ప్రాణాలు వదిలిన ఘటన చోటుచేసుకుంది. అక్రమ మద్య వ్యాపారాలపై నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి పట్టించుకోని స్థానిక ఖజుర్వాని గ్రామ పోలీసుస్టేషన్ పరిధిలోని పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు.

అక్రమమద్యం సేవించడం వల్లనే వీరు మృతిచెందారని కుటుంబీకులు, స్థానిక ప్రజలు వాపోయారు. ముందస్తు రిపోర్టులు సైతం అక్రమ మద్యానికే వీరు బలైనట్టు వెల్లడించాయి. కానీ  స్థానిక పోలీసులు, అధికారులు మాత్రం తమ నిర్లక్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దీన్ని ఖండించారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో టీమ్ ను ఏర్పాటుచేసిన ప్రభుత్వం, అక్రమ మద్య వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ ఖజుర్వాని గ్రామంలోని స్థానిక పోలీసు స్టేషన్ పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తేల్చింది. వెంటనే 15 మంది పోలీసులను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించిన నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ సైతం తీవ్రంగా స్పందించారు. ఘటనకు దోహదం చేసిన వారిని ఎవరిని వదిలేది లేదన్నారు.

తరుచు దాడులు నిర్వహిస్తూ అక్రమ మద్యాలను అరికడుతున్నామని పోలీసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతుండగా.. మద్య నిషేధం చేపట్టినప్పటినుంచి ఎలాంటి రైడ్స్ తమ ప్రాంతాల్లో జరగలేదని స్థానికులు పేర్కొంటున్నారు. పైగా పోలీసులే మద్యం సేవిస్తూ ఊగులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని ఆరు గ్రామాలకు నితీష్ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఈ నెల మొదట్లోనే స్టేట్ పోలీసు హెడ్ క్వార్టర్స్లో తమ ప్రాంతాల్లో మద్యాన్ని రికవరీ చేయడం లేదని 11 ఎస్హెచ్ఓలు సస్పెండ్ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement