బంగారం కొనుగోళ్లపై అరుణ్ జైట్లీ స్పష్టత | Gold Purchased Out Of Disclosed Income Is Not Chargeable To Tax | Sakshi
Sakshi News home page

బంగారం కొనుగోళ్లపై అరుణ్ జైట్లీ స్పష్టత

Dec 1 2016 3:47 PM | Updated on Aug 20 2018 4:55 PM

బంగారం కొనుగోళ్లపై అరుణ్ జైట్లీ స్పష్టత - Sakshi

బంగారం కొనుగోళ్లపై అరుణ్ జైట్లీ స్పష్టత

నోట్ల రద్దు అనంతరం కేంద్రం దృష్టి బంగారంపై పడినట్టు పలు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బంగారం కొనుగోళ్లపై స్పష్టతనిచ్చారు.

నోట్ల రద్దు అనంతరం కేంద్రం దృష్టి బంగారంపై పడినట్టు పలు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బంగారం కొనుగోళ్లపై స్పష్టతనిచ్చారు. వెల్లడించిన డబ్బుతో బంగారం కొంటే ఎలాంటి సమస్య ఉండదని వెల్లడించారు. దాంతో పాటు పన్ను మినహాయింపు ఉన్న డబ్బుతో, ఇంట్లో దాచుకున్న నగదుతో బంగారం కొన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ఇలా కొనుగోలు చేసిన బంగారంపై, నగలపై ఎలాంటి పన్నును ప్రభుత్వం విధించదని జైట్లీ క్లారిటీ ఇచ్చారు. బంగారంపై నడుస్తున్న ప్రచారం అవాస్తవమని జైట్లీ వెల్లడించారు. అంతేకాక వారసత్వంగా వచ్చిన బంగారంపైనా పన్ను ఉండదని తెలిపారు. వివాహమైన మహిళ వద్ద అరకేజీ బంగారం ఉంటే ప్రభుత్వం సీజ్ చేయదు, అదేవిధంగా పెళ్లి కాని మహిళ వద్ద 250 గ్రాముల బంగారం ఉన్నా ఎలాంటి స్వాధీనం ఉండదని అరుణ్ జైట్లీ వివరించారు. పురుషుల వద్ద కూడా 100 గ్రాముల మేర బంగారం ఉండొచ్చని, దీనిపై కూడా ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పదని చెప్పారు. 
 
Advertisement
 
Advertisement
Advertisement