భారీ నగదు, బంగారంతో పట్టుబడ్డ ప్రయాణికులు | Gold, foreign currencies seized from passengers | Sakshi
Sakshi News home page

భారీ నగదు, బంగారంతో పట్టుబడ్డ ప్రయాణికులు

Jul 14 2014 6:32 PM | Updated on Sep 2 2017 10:17 AM

విదేశాల నుంచి అక్రమ బంగారాన్ని తరలిస్తున్న ఘటనలు దేశంలో రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

కొచ్చి:విదేశాల నుంచి అక్రమ బంగారాన్ని తరలిస్తున్న ఘటనలు దేశంలో రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కొంతమంది ప్రయాణికులు రూ.21లక్షల విలువ గల బంగారాన్ని, రూ. 22 లక్షల విదేశీ నగదును తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులకు చిక్కిన ఘటన కొచ్చి అంతర్జాతీయ విమానశ్రయంలో చోటు చేసుకుంది. సోమవారం షార్జా నుంచి దిగిన ప్రయాణికులు 482 గ్రాములు బంగారాన్ని కడ్డీల రూపంలో తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

 

ఇందులో ఒక ప్రయాణికుడు నుంచి స్వాధీనం చేసుకున్న 260 గ్రాముల గోల్డ్ చైన్ విలువ దాదాపు రూ.7.42 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.మరో ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.22 లక్షల విలువగల విదేశీ నగదును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement