కొత్తకొత్త కార్లతో కనువిందుచేస్తున్న ఆటో షో | Geneva Motor Show 2017: World's best at Europe's biggest auto exhibition | Sakshi
Sakshi News home page

కొత్తకొత్త కార్లతో కనువిందుచేస్తున్న ఆటో షో

Mar 7 2017 7:28 PM | Updated on Sep 5 2017 5:27 AM

కొత్తకొత్త కార్లతో కనువిందుచేస్తున్న ఆటో షో

కొత్తకొత్త కార్లతో కనువిందుచేస్తున్న ఆటో షో

లగ్జరీ కార్ల నుంచి క్రాస్ ఓవర్ వెహికిల్స్ వరకు జిల్ జిగేల్ అనిపిస్తూ 87వ అంతర్జాతీయ జెనీవా ఆటో షో ప్రీమియర్స్ స్విట్జర్లాండ్లో అట్టహాసంగా ప్రారంభమైంది.

లగ్జరీ కార్ల నుంచి క్రాస్ ఓవర్ వెహికిల్స్ వరకు జిల్ జిగేల్ అనిపిస్తూ 87వ అంతర్జాతీయ జెనీవా ఆటో షో ప్రీమియర్స్ స్విట్జర్లాండ్లో అట్టహాసంగా ప్రారంభమైంది. చిన్న కార్ డిజైనర్లు, పెద్ద పెద్ద కార్ల తయారీదారులు ఈ ప్రీమియర్ ఆటో షోలో తమ వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రపంచంలోనే ఎంతో అత్యుత్తమ ఆటో ఎగ్జిబిషన్ గా పేరుతెచ్చుకున్న ఈ షో, యూరోపియన్ బ్రాండులకు ఎంతో ప్రతిష్టాత్మకం. మార్చి 9 నుంచి మార్చి 19 మధ్యలో ఈ ఆటో షో అధికారికంగా నిర్వహిస్తారు.
 
బ్రెగ్జిట్, అమెరికాలో ట్రేడ్ పాలసీలో మార్పులు వంటి ఎన్నో ప్రతికూలాంశాలను ఆటో ఇండస్ట్రి ఎదుర్కొంటున్నప్పటికీ  కొత్త కొత్త వెహికిల్స్ ప్రదర్శనలో ఇసుమింతమైన వెనుకంజ వేయలేదు. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ తన రేంజ్ రోవర్ వెలార్ ను మంగళవారం ప్రదర్శనకు ఉంచింది. ఫోక్స్ వాగన్ సైతం తన కొత్త సెల్ఫీ డ్రైవింగ్ కాన్సెఫ్ట్ కారును ఈ ప్రీమియర్ షోలో రివీల్ చేసింది. సెడ్రిక్ ను ప్రదర్శనకు పెట్టింది. ఎలాంటి స్టీరింగ్ వీల్స్, పెడల్స్ లేని ఈ కారుకు డ్రైవర్ అవసరం ఉండదు.
 
ఆడీ, బెంట్లీ, స్కోడా వంటి గ్లోబల్ బ్రాండులకు పోటీగా వివిధ వెర్షన్లలో ఈ కారును ప్రవేశపెట్టాలని ఫోక్స్ వాగన్ ప్లాన్ వేస్తోంది. ఫోక్స్ వాగన్, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్లతో పాటు  పలు అంతర్జాతీయ బ్రాండులు ఈ ప్రీమియర్ షోలో అదరగొడుతున్నాయి.  ఈ ఆటో షోకు పలు ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటో కంపెనీల ప్రతినిధులతో పాటు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ హాజరయ్యారు. టామో సబ్-బ్రాండులో టాటాల తొలి కారు తెల్లటి రంగులో ఆహుతులను ఆకట్టుకుంటోంది.  




Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement