అత్తను కిడ్నాప్‌ చేసి 250 కోట్లు డిమాండ్‌! | Formula One tycoon Bernie Ecclestone mother in law is KIDNAPPED in Brazil | Sakshi
Sakshi News home page

అత్తను కిడ్నాప్‌ చేసి 250 కోట్లు డిమాండ్‌!

Jul 26 2016 1:34 PM | Updated on Sep 4 2017 6:24 AM

ఫార్ములా వన్ టైకూన్ అయిన బెర్నీ ఎస్సెల్‌స్టోన్‌కు భారీ షాక్‌ తగలింది.

ఫార్ములా వన్ టైకూన్ అయిన బెర్నీ ఎస్సెల్‌స్టోన్‌కు భారీ షాక్‌ తగలింది. ఆయన అత్తయ్యను గ్యాంగ్‌స్టర్స్‌ బ్రెజిల్‌లో కిడ్నాప్ చేశారు. 28మిలియన్ పౌండ్లు పరిహారం చెల్లిస్తేనే ఆమెను విడుదల చేస్తామని గ్యాంగ్‌స్టర్స్‌ కుటుంసభ్యులకు వర్తమానం పంపారు.

టైకూన్‌ బ్రెజిలియన్ భార్య ఫాబియాన ఫ్లోసి తల్లి అపరిషిదా షుంక్ (67)ను సావో పాలోలోని ఆమె ఇంటి బయట గ్యాంగ్‌స్టర్లు కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్‌ మిస్టరీని ఛేదించేందుకు మరోవైపు బ్రెజిల్ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్టు తెలిసింది. బిలియనీర్ అయిన 89 ఏళ్ల బెర్నీ లేటు వయస్సులో 38 ఏళ్ల ఫాబియాన ఫ్లోసిని పెళ్లి చేసుకున్నాడు. 2009లో బ్రెజిలియన్ గ్రాండ్‌ ప్రిక్స్ సందర్భంగా వీరు తొలిసారి కలుసుకున్నారు. అప్పుట్లో ఫ్లోసి బ్రెజిల్ ఫార్ములా వన్ డైరెక్టర్‌గా ఉండేది. కొంతకాలానికి వీరి మధ్య ప్రేమ చిగురించింది. బ్రిటన్‌లోనే నాలుగో అత్యంత సంపన్నుడిగా పేరొందిన బెర్నీ అంగరంగ వైభవంగా ఫాబియానను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట లండన్‌లో నివసిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement