ఇస్రో మాజీ చైర్మన్ కన్నుమూత | Former ISRO chief MGK Menon passes away | Sakshi
Sakshi News home page

ఇస్రో మాజీ చైర్మన్ కన్నుమూత

Nov 22 2016 8:21 PM | Updated on Jul 31 2018 5:31 PM

ఇస్రో మాజీ చైర్మన్ కన్నుమూత - Sakshi

ఇస్రో మాజీ చైర్మన్ కన్నుమూత

ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఎంజీకే మీనన్(88) మంగళవారం న్యూఢిల్లీలో కన్నుమూశారు.

బెంగళూరు : ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఎంజీకే మీనన్(88) మంగళవారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా సైన్సులో విశిష్టమైన సేవలందించిన మీనన్, హోమీ జే బాబా లాగా పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు కీలక వ్యక్తిగా వ్యవహరించారు. 1972లో మీనన్ ఇస్రో చైర్మన్గా ఎంపికయ్యారు. అనంతరం వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో సైన్సు అండ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖకు సహాయమంత్రిగా పనిచేశారు. 35ఏళ్ల వయసులోనే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కు డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
 
పద్మ విభూషణ్ వంటి పలు అవార్డులచే ఆయనను కేంద్రప్రభుత్వం సత్కరించింది. 1982-1989మధ్య ప్లానిక్ కమిషన్ సభ్యుడిగా, 1986-89 మధ్య ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా, 1989-1990 మధ్య సీఎస్ఐఆర్ వైస్ప్రెసిడెంట్గా అనంతరం 1990-96 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా ఆయన పలు కీలక బాధ్యతలు చేపట్టారు.  కాస్మిక్ రే అధ్యయనంలో ఆయన ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement