బీజేపీలో చేరిన లవ్లీ | Former Congress MLA Arvinder Singh Lovely joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన లవ్లీ

Jan 13 2015 8:49 PM | Updated on Sep 2 2017 7:39 PM

బీజేపీలో చేరిన లవ్లీ

బీజేపీలో చేరిన లవ్లీ

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అర్విందర్ సింగ్ లవ్లీ తన మద్దతుదారులతో కలిసి మంగళవారం బీజేపీలో చేరారు.

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ హోం మంత్రి బూటా సింగ్ తనయుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అర్విందర్ సింగ్ లవ్లీ తన మద్దతుదారులతో కలిసి మంగళవారం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు నచ్చి బీజేపీలో చేరినట్టు ఆయన తెలిపారు.

వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లవ్లీకి టిక్కెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంతో ఆయన బీజేపీ చేరారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. 2008లో దియోలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అర్విందర్ సింగ్, 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఓటమి చవిచూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement