breaking news
buta singh
-
కేంద్ర మాజీ హోం మంత్రి కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్(86) కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా బూటా సింగ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలు, పేదల సంక్షేమానికై గళమెత్తిన, అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ సైతం ట్విటర్ వేదికగా బూటా సింగ్‌కు నివాళులు అర్పించారు. జర్నలిస్టు నుంచి కేంద్ర హోం మంత్రిగా.. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలోని ముస్తఫాపూర్‌లో 1934, మార్చి 21న బూటా సింగ్ జన్మించారు. బాంబేలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన, బుంధేల్ఖండ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. 1964లో మంజీత్ కౌర్‌ను బూటా సింగ్ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇక తొలుత జర్నలిస్టుగా కెరీర్ ఆరంభించిన బూటా సింగ్.. అకాలీదళ్ పార్టీలో చేరి రాజకీయ జీవితం ఆరంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దళిత నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. గాంధీ కుటుంబానికి సన్నిహితులయ్యారు. (చదవండి: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత) సుమారు ఎనిమిది పర్యాయాలు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 1978-80 మధ్య కాలంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన, రాజీవ్ గాంధీ హయాంలో కేంద్ర హోం మంత్రిగా విధులు నిర్వర్తించారు. అనంతరం రైల్వే, పార్లమెంటరీ కమిటీ వ్యవహారాలు, క్రీడలు, షిప్పింగ్, వ్యవసాయ, సమాచార, గృహనిర్మాణ తదితర శాఖల్లో పనిచేశారు. ఆ తర్వాత 2004-06 వరకు బిహార్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. 2007-2010 వరకు ఎస్సీ జాతీయ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఇక కొన్నాళ్లపాటు కాంగ్రెస్ పార్టీకి దూరమైన బూటా సింగ్ 2015 అక్టోబరులో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. Shri Buta Singh Ji was an experienced administrator and effective voice for the welfare of the poor as well as downtrodden. Saddened by his passing away. My condolences to his family and supporters. — Narendra Modi (@narendramodi) January 2, 2021 -
బీజేపీలో చేరిన లవ్లీ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ హోం మంత్రి బూటా సింగ్ తనయుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అర్విందర్ సింగ్ లవ్లీ తన మద్దతుదారులతో కలిసి మంగళవారం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు నచ్చి బీజేపీలో చేరినట్టు ఆయన తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లవ్లీకి టిక్కెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంతో ఆయన బీజేపీ చేరారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. 2008లో దియోలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అర్విందర్ సింగ్, 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఓటమి చవిచూశారు. -
ప్రాంతీయ వ్యత్యాసంపై పోరు
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ప్రాంతీయ వ్యత్యాసం తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తో ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించిన వాల్మీకి సమరభేరి బహిరంగ సభ విజయవంతమైంది. జిల్లాతో పాటు అనంతపురం, మహబూబ్‌నగర్, కడప, ప్రకాశం జిల్లాల నుంచి వాల్మీకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో స్థానిక మున్సిపల్ హైస్కూల్ మైదానం కిక్కిరిసింది. ముందుగా కలెక్టరేట్ నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పలువురు వాల్మీకులు గుర్రాలపై ర్యాలీలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాల్మీకి మహర్షి చిత్రంతో రూపొందించిన కాషాయ జెండాలు రెపరెపలాడాయి. స్థానిక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద వాల్మీకి సర్కిల్ ఏర్పాటుకు భూమి పూజ చేపట్టారు. వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి(వీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుభాస్‌చంద్రబోస్ అధ్యక్షతన నిర్వహించిన సభకు కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి బూటాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో ఆయన మాట్లాడుతూ వాల్మీకుల్లో ప్రాంతీయ వ్యత్యాసాన్ని యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ఎమ్మెల్యే బోయ శ్రీరాములు మాట్లాడుతూ వీఆర్పీఎస్ ఉద్యమానికి అన్నివిధాల సహకరిస్తానన్నారు. వాల్మీకులు ఫ్యాక్షన్‌కు దూరంగా ఉంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. కర్ణాటకలో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నందునే 15 మంది ఎమ్మెల్యేలు, ఇరువురు ఎంపీలుగా ఎంపికయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో బరిలో నిలిచే వాల్మీకులను పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేయాలన్నారు. సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్ సాధనకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు. ఉద్యమం ప్రారంభించినప్పుడు తనకు నలుగురు అన్నలేనని.. ప్రస్తుతం వేలాది మంది అన్నలు, తమ్ముళ్లు మేమున్నామని భరోసానిస్తున్నట్లు చెప్పారు. కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వాల్మీకులు అధికంగా ఉన్నందున దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు 8 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న చైతన్యాన్ని చూస్తే లక్ష్యం నెరవేరుతుందనే నమ్మకం కలుగుతోందన్నారు. బహిరంగ సభలో భూగర్భ ఖనిజాల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్, అనంతపురం మాజీ ఎంపీ కాల్వ శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి.వై.రామయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీటీ నాయుడు, మహిళా నాయకురాళ్లు గుడిసె క్రిష్ణమ్మ, కప్పట్రాళ్ల బొజ్జమ్మ, మంత్రాలయం లక్ష్మన్న, గుడిసె క్రిష్ణమ్మ, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు గిడ్డయ్య, కార్యదర్శి రాంభీంనాయుడు, జిల్లా కార్యదర్శి ఎల్.వెంకటేశ్వర్లు, లాయర్ ప్రభాకర్, కర్నూలు మెడికల్ కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీ ప్రసాద్, బీసీ సాధికార కమిటీ కేంద్ర సభ్యులు టి.మద్దులేటి, కప్పట్రాళ్ల మద్దిలేటినాయుడు, వలసల రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.