వచ్చే నెలలో ఎఫ్‌ఎం రేడియో మూడో దశ వేలం ! | FM radio phase 3 auction by next month, says Minister | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో ఎఫ్‌ఎం రేడియో మూడో దశ వేలం !

Sep 14 2013 2:28 AM | Updated on Sep 1 2017 10:41 PM

ఎఫ్‌ఎం రేడియో మూడో దశ వేలం వచ్చే నెలలో జరిగే అవకాశాలున్నాయని సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారి చెప్పారు.

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎం రేడియో మూడో దశ వేలం వచ్చే నెలలో జరిగే అవకాశాలున్నాయని సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారి చెప్పారు. ఎఫ్‌ఎం రేడియో వేలానికి 2011లోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఆ తర్వాత పరిశ్రమ వర్గాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని, వాటిని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కు నివేదించామని వివరించారు. ఇక్కడి సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. వేలం పారదర్శకంగా జరగడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement