ఐదుగురు రైతుల ఆత్మహత్య | Five of farmers' suicide in telangana districts | Sakshi
Sakshi News home page

ఐదుగురు రైతుల ఆత్మహత్య

Oct 15 2015 3:21 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఐదుగురు రైతుల ఆత్మహత్య - Sakshi

ఐదుగురు రైతుల ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక తెలంగాణ జిల్లాల్లో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

సాక్షి నెట్‌వర్క్: అప్పుల బాధ తాళలేక తెలంగాణ జిల్లాల్లో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బర్దిపూర్‌కు చెందిన రైతు మూడ నర్సింలు(38), ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం దుగ్నేపల్లికి చెందిన రైతు వెన్నపురెడ్డి సంజీవరెడ్డి(45), రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీకి చెందిన సప్పిడి అశోక్(45),  మర్పల్లి మండలం కోటమర్పల్లి గ్రామానికి చెందిన తుడుము పెంటయ్య(60), మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలం ఐతోల్ గ్రామానికి చెందిన కర్నె కృష్ణయ్య (48) బలవన్మరణాలకు పాల్పడ్డారు.
 
కరెంట్ షాక్‌తో ఒకరు...
పొలం వద్ద కాపలాగా ఉన్న కుక్కకు ఆహారం పెట్టడానికి వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్‌తో మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవి లింగాలలో జరిగింది. గ్రామానికి చెందిన శివగారి బాలరాజు(46) పొలం వద్ద ఉన్న కుక్కకు ఆహారం పెట్టేందుకు మంగళవారం రాత్రి పొలానికి వెళ్లాడు. ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో బుధవారం కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, బోరు మోటారు వద్ద కరెంట్ షాక్‌తో చనిపోయి కనిపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement