రన్ వేపై కూలిపోయిన విమానం | Five die in Malta runway plane crash | Sakshi
Sakshi News home page

రన్ వేపై కూలిపోయిన విమానం

Oct 24 2016 4:23 PM | Updated on Sep 4 2017 6:11 PM

రన్ వేపై కూలిపోయిన విమానం

రన్ వేపై కూలిపోయిన విమానం

మాల్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై చిన్నపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

వల్లెట్టా: మాల్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై చిన్నపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.

లుఖా విమానాశ్రయం నుంచి లిబియాకు బయల్దేరిన ఈ విమానం కాసేపటికే కుప్పకూలింది. మృతుల వివరాలు తెలియాల్సివుంది. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ విమానంలో యూరోపియన్ యూనియన్ బోర్డర్ ఏజెన్సీకి చెందిన అధికారులు ఉన్నారని మొదట వార్తలు వచ్చాయి. అయితే తమ సిబ్బంది ఎవరూ లేరని ఆ ఏజెన్సీ తెలియజేసింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే దిశ మార్చుకుని రన్ వే కూలినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement