ఎన్నికల షెడ్యూల్కు తుదిమెరుగులు: ఏప్రిల్ 7 నుంచి ఎన్నికలు | Finishing touches to Election schedule | Sakshi
Sakshi News home page

ఎన్నికల షెడ్యూల్కు తుదిమెరుగులు: ఏప్రిల్ 7 నుంచి ఎన్నికలు

Mar 2 2014 6:25 PM | Updated on Aug 14 2018 4:46 PM

ఎన్నికల షెడ్యూల్కు తుదిమెరుగులు: ఏప్రిల్ 7 నుంచి ఎన్నికలు - Sakshi

ఎన్నికల షెడ్యూల్కు తుదిమెరుగులు: ఏప్రిల్ 7 నుంచి ఎన్నికలు

కేంద్ర ఎన్నికల సంఘం(ఈసి) సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు తుదిమెరుగులు దిద్దుతోంది.

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసి) సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు తుదిమెరుగులు దిద్దుతోంది. ఈ విషయమై ఈసి అధికారులు కేంద్ర హోంశాఖ అధికారులతో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. రెండు మూడు రోజులలో ఎన్నికల షెడ్యూల్కు తుదిరూపం తీసుకువస్తారు.  

 దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.  ఏప్రిల్ 2వ వారం నుంచి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 7-10 మధ్య మొదటి విడత పోలింగ్ జరుగుతుందని  ఈసీ వర్గాల సమాచారం.  బుధవారం లేదా గురువారం ఎన్నికల షెడ్యూలు విడుదల చేస్తారు.  ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement