సుజనా చౌదరిపై సినీ రచయిత ఫైర్‌! | film writer fires on sujana chowdary | Sakshi
Sakshi News home page

సుజనా చౌదరి.. నువ్వే పందివి..

Jan 26 2017 12:26 PM | Updated on Mar 28 2019 5:27 PM

సుజనా చౌదరిపై సినీ రచయిత ఫైర్‌! - Sakshi

సుజనా చౌదరిపై సినీ రచయిత ఫైర్‌!

ప్రత్యేక హోదాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరిపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

  • నీతోనే ఆట స్టార్‌ చేస్తాం..
  • హైదరాబాద్‌: ప్రత్యేక హోదాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరిపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. 'ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం. ఇంకా దాని గురించి మాట్లాడడం అనవరం' అని ఆయన పేర్కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొని ఆందోళన చేసేవారు.. ఏ కోళ్లపందాలో, పందుల పందాలో నిర్వహించుకోవాలని ఆయన దురుసు వ్యాఖ్యలు చేశారు.

    సుజనా చౌదరి వ్యాఖ్యలపై ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్న సుజనా చౌదరే పంది అని విమర్శించారు. అలాంటి పందివైన నీతోనే ఆట స్టార్‌ చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌లను విమర్శిస్తే ఊరుకోబోమన్నారు. విద్యార్థులను అరెస్టు చేస్తే హోదా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చిన్ని కృష్ణ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement