‘తయారీ’ వృద్ధికి ఫిక్కీ సూత్రాలు | Ficci suggests 12-point action plan to boost manufacturing sector | Sakshi
Sakshi News home page

‘తయారీ’ వృద్ధికి ఫిక్కీ సూత్రాలు

Sep 19 2013 3:37 AM | Updated on Oct 9 2018 4:06 PM

దేశీయ తయారీ రంగం వృద్ధికి ఫిక్కీ 12 సూత్రాల ప్రణాళికను రూపొందించింది. తద్వారా వృద్ధిని గాడిన పెట్టడం, ఉద్యోగాలను కల్పించడం చేయవచ్చునని పేర్కొంది.

 న్యూఢిల్లీ: దేశీయ తయారీ రంగం వృద్ధికి ఫిక్కీ 12 సూత్రాల ప్రణాళికను రూపొందించింది. తద్వారా వృద్ధిని గాడిన పెట్టడం, ఉద్యోగాలను కల్పించడం చేయవచ్చునని పేర్కొంది. అవసరమైన చర్యలను తీసుకోవడం ద్వారా విధానాలను పటిష్టపరచి పెట్టుబడులను ఆకట్టుకోవచ్చునని ప్రభుత్వానికి సూచించింది. ప్రవాస భారతీయులకు రుపీ బాండ్లను జారీ చేయడం, కనీస పెట్టుబడుల పరిమితిని తగ్గించడం, పాత లావాదేవీలపైనా పన్నులు విధించే (రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్) చట్టాలను సవరించడం, పన్ను విధానాల రూపకల్పనలో చర్చలకు అవకాశమివ్వడం, బొగ్గు సరఫరాలకు ప్రాధాన్యమివ్వడం, విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను పటిష్టపరచడం వంటి సూచనలున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement