'పీడికా'తో ప్రముఖ మ్యాగజీన్కు తిప్పలు | Fashion Magazine Misspells Deepika Padukone's Name, Twitter Trolls Them Mercilessly | Sakshi
Sakshi News home page

'పీడికా'తో ప్రముఖ మ్యాగజీన్కు తిప్పలు

Aug 25 2016 1:29 PM | Updated on Sep 4 2017 10:52 AM

'పీడికా'తో ప్రముఖ మ్యాగజీన్కు తిప్పలు

'పీడికా'తో ప్రముఖ మ్యాగజీన్కు తిప్పలు

డిజిటల్ ప్లాట్ఫామ్లో వార్తను క్షణాల్లో ప్రజల ముందుంచడానికి వెబ్ జర్నలిజం తెగ పోటీపడుతోంది.

డిజిటల్ ప్లాట్ఫామ్లో వార్తను క్షణాల్లో ప్రజల ముందుంచడానికి వెబ్ జర్నలిజం తెగ పోటీపడుతోంది. ఈ తొందరపాటులో చిన్నచిన్న తప్పులు దొర్లడం సర్వసాధారణం అయిపోయింది. వ్యాకరణ దోషాలు, తప్పుగా చిత్రాలు పోస్టు చేయడం వంటివి సెకన్లలో జరిగిపోతూ ఉంటాయి. కానీ ఓ పాపులర్ ఫ్యాషన్ మ్యాగజీన్ ఏకంగా బాలీవుడ్ అందాల నటి పేరునే మార్చేసింది. అలా పేరు మార్చేసిన మ్యాగజీన్ ట్విట్టర్ నెటిజన్ల ముందు తెగ నవ్వుల పాలైందట.

ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకటించిన 2016 అత్యధిక నటీమణలు జాబితాలో మొదటిసారి దీపికా పదుకొనే 10 మిలియన్ డాలర్లతో టాప్-10లో నిలవడంతో హార్పర్స్ బజార్ ఫ్యాషన్ మ్యాగజీన్ తామే ముందుగా వార్తను అందించాలనే తొందరపాటులో తప్పులో కాలేసింది. దీపికా పదుకొనే పేరును పీడికా పదుకొనేగా ప్రచురించింది. ఈ అక్షర దోషాన్ని వెంటనే గుర్తించిన ట్విట్టర్ నెటిజన్లు వెంటనే జోక్స్ పేల్చడం ప్రారంభించారు. ఈ మ్యాగజీన్ చేసిన చిన్న పొరపాటుకు కావాల్సినన్నీ కామెంట్లు, గిప్ట్లు ట్విట్టర్లోనే అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement