మహిళలపై ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై దుమారం | Farooq Abdullah kicks up controversy, then apologises | Sakshi
Sakshi News home page

మహిళలపై ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై దుమారం

Dec 6 2013 7:35 PM | Updated on Sep 2 2017 1:20 AM

మహిళలపై ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై దుమారం

మహిళలపై ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై దుమారం

మహిళలను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోరాదంటూ కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరులశాఖ మంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.

న్యూఢిల్లీ: మహిళలను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోరాదంటూ కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరులశాఖ మంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. లైంగిక వేధింపుల ఫిర్యాదు దాఖలైతే పురుషులు జైలు పాలయ్యే అవకాశం ఉందని ఫరూక్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావటంతో అనంతరం ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పాల్సిందేనని తన తనయుడు, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సూచించటంతో ఫరూక్ కాళ్ల బేరానికి వచ్చారు.

 

ఇటీవల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గంగూలీ, ఇతర ప్రముఖులు లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకోవటంపై శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ ఫరూక్ ఈ వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారింది. ‘ఓ మహిళను కార్యదర్శిగా నియమించుకోరాదని నేను భావిస్తున్నా. కర్మకాలి ఏదైనా ఫిర్యాదు దాఖలైందంటే మేం జైలు పాలు కావాల్సిందే’ అని పార్లమెంట్ భవనం వద్ద ఆయన మీడియాతో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement