తోటపల్లి ప్రాజెక్టు జలాశయం నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన 100 మంది రైతులు ఆందోళనకు దిగారు.
చిగురుమామిడి(కరీంనగర్): తోటపల్లి ప్రాజెక్టు జలాశయం నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన 100 మంది రైతులు ఆందోళనకు దిగారు. కోహెడ- ముల్కనూర్ రహదారిపై బుధవారం సాయంత్రం 2 గంటలకు రాస్తారోకోకు పూనుకున్నారు.
ప్రాజెక్టు కారణంగా తమ 500 ఎకరాల సాగు భూములు ముంపునకు గురవుతున్నాయని, అవి మునిగితే తామెలా బతకాలని ప్రశ్నించారు. ప్రాజెక్టును రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరైందేనని వారు స్పష్టం చేశారు. రైతులు గంట అనంతరం ఆందోళనను విరమించారు.