ఫేస్బుక్ వీడియోలను టీవీలోనూ చూడొచ్చు!

ఫేస్బుక్ వీడియోలను టీవీలోనూ చూడొచ్చు! - Sakshi


ఫేస్ బుక్ వీడియోలను టెలివిజన్ స్క్రీన్ పై చూడాలనుకుంటున్నారా..? అయితే మీ కోరిక సాధ్యమవుతుందట. వీడియో స్ట్రీమింగ్ సర్వీసులో కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో కొత్త ఫీచర్తో మన ముందుకు రాబోతుంది. ఆ ఫీచర్ తో తన వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను టెలివిజన్ స్క్రీన్పై అందించేందుకు టెస్టింగ్ ప్రారంభించిందట. దీంతో యూజర్లకు అందించే వీడియో కంటెంట్ను ఫేస్బుక్ పెంచుకోవాలనుకుంటోంది. ఇటీవలే లైవ్ బ్రాండ్కాస్టింగ్ సర్వీసును ప్రారంభించిన ఫేస్బుక్, తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ద్వారా ఫేస్బుక్ వీడియోలను టీవీలో కూడా వీక్షించేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఎయిర్ప్లే, క్రోమ్కాస్ట్ల ద్వారా ఈ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను టీవీలకు కనెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది.ఎయిర్ప్లే, క్రోమ్కాస్ట్ ద్వారా వీడియోలను యాప్ నుంచి టీవీలోకి బెటర్గా అందించడానికి ఫేస్బుక్ యాప్ను టెస్ట్ చేస్తున్నామని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఫీచర్తో యూజర్లు తమ యాప్లో వీడియో ప్లేయర్ను మినిమైజ్ చేసి, న్యూస్ ఫీడ్ను కూడా చూసుకోవచ్చని మార్కెటింగ్ ల్యాండ్ రిపోర్టులు చెబుతున్నాయి. క్రోమ్కాస్ట్ యూజర్లు ప్లే లిస్ట్ను క్రియేట్ చేసుకుని  ఒకదాని తర్వాత మరొకటి ప్లే అయ్యేలా సెట్ కూడా చేసుకోవచ్చని తెలిపాయి. ఈ కొత్త ఫీచర్తో ఫేస్బుక్, వీడియో స్ట్రీమింగ్ డిపార్ట్మెంట్లో ఆధిపత్య స్థానానికి వెళ్లనుంది. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్స్కు ఈ ఫీచర్ ఎక్కువగా ఉపయోగపడనుంది. దీంతో లైవ్లను ఫేస్బుక్ యాప్లో వీక్షించే యూజర్లు ఇక నుంచి బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top