ఓటర్ల జాబితా సవరణకు ఈసీ ఆదేశం | election commission orders to revise voters list | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితా సవరణకు ఈసీ ఆదేశం

Oct 6 2014 12:18 AM | Updated on Sep 2 2017 2:23 PM

ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు 2015 జనవరి 1ని అర్హత తేదీగా నిర్ణయిస్తూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

అగార్తలా: ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు 2015 జనవరి 1ని అర్హత తేదీగా నిర్ణయిస్తూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్‌లలో ఈ సవరణ చేపట్టరాదని పేర్కొంది. ఈ విషయాన్ని ఈసీకి చెందిన ఓ అధికారి ఆదివారం ఇక్కడ తెలిపారు. ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లకుండా చూసేందుకు సంబంధిత అధికారులకు శిక్షణ ఇప్పించాలని ఈసీ సూచించింది. అర్హులైన ఓటర్లంతా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా అన్ని పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లతో విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement