ప్రశాంతంగా ఈద్ ప్రార్థనలు | eid mubarak | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఈద్ ప్రార్థనలు

Oct 7 2014 12:35 AM | Updated on Jul 11 2019 6:18 PM

ప్రశాంతంగా ఈద్ ప్రార్థనలు - Sakshi

ప్రశాంతంగా ఈద్ ప్రార్థనలు

త్యాగానికి ప్రతీకైన బక్రీద్ సందర్భంగా సోమవారం దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు.

న్యూఢిల్లీ: త్యాగానికి ప్రతీకైన బక్రీద్ సందర్భంగా సోమవారం దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. దేశ రాజధానిలోని చారిత్రక జామా మసీద్, ఫతేపూర్ మసీదుల్లో వేల సంఖ్యలో ప్రార్థనలకు హాజరై నమాజ్ అనంతరం ఈద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలతో స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రార్థనా స్థలాల  వద్ద ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇస్లాం ప్రవచించిన ప్రేమ, దయ, కరుణ, సామరస్య గుణాలను అనుసరించాలని మత గురువులు ఉద్బోధించారు. ఇటీవల భారీ వరదలతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్‌లో ఆడంబరాలు, ఆర్భాటాలకు దూరంగా ప్రార్థనల్లో ముస్లింలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement