ఆర్థికవ్యవస్థపై దాడుల ప్రభావం తక్కువే | Economic impact of India-Pak tensions to be extremely marginal: Arun Jaitley | Sakshi
Sakshi News home page

ఆర్థికవ్యవస్థపై దాడుల ప్రభావం తక్కువే

Oct 4 2016 12:55 PM | Updated on Sep 4 2017 4:09 PM

ఆర్థికవ్యవస్థపై దాడుల ప్రభావం తక్కువే

ఆర్థికవ్యవస్థపై దాడుల ప్రభావం తక్కువే

భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయనే భయాందోళనలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపడేశారు.

భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే భయాందోళనలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపడేశారు. ఆర్థికపరంగా అంత పెద్దమొత్తంలో మార్పులు సంభవించవని, స్వల్పంగా మాత్రమే ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఈ ప్రభావంతో మార్కెట్లు, రూపాయిలో వస్తున్న మార్పులు కేవలం తాత్కాలికమేనని తెలిపారు. భారత్లో పెట్టే విదేశీ పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని పేర్కొన్నారు. 
 
టొరంటోస్ రోట్మ్యాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో ఆయన ప్రసంగించారు. ఉడి ఉగ్రదాడి అనంతరం పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం జరిపిన నిర్దేశిత దాడులతో మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. బ్రెగ్జిట్ పరిమాణాల అనంతరం రూపాయి ఈ మేర పడిపోవడం ఇదే మొదటిసారి. సరిహద్దు ప్రకంపనాలతో యుద్ధవాతావరణం నెలకొంటుందనే టెన్షన్తో మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగింది. వాణిజ్య పరంగా రెండు దేశాల మధ్య ఆటంకాలు రావొచ్చని ఆందోళనలు ఎగిశాయి. ఈ భయాందోళలన్నింటినీ కొట్టిపారేస్తూ తాజా పరిస్థితుల్లో నెలకొన్న టెన్షన్ ప్రభావం మన ఆర్థికవ్యవస్థపై స్వల్పంగానే ఉంటుందని తెలిపారు. అది కూడా తాత్కాలికమేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement