సునంద పుష్కర్ మృతిపై ఎయిమ్స్ వైద్యుల నివేదిక | Drug overdose cause of Sunanda's death | Sakshi
Sakshi News home page

సునంద పుష్కర్ మృతిపై ఎయిమ్స్ వైద్యుల నివేదిక

Jan 20 2014 8:54 PM | Updated on Aug 16 2018 4:04 PM

సునంద పుష్కర్ - Sakshi

సునంద పుష్కర్

కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ వైద్యులు మేజిస్ట్రేటుకు అందజేశారు.

ఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ వైద్యులు మేజిస్ట్రేటుకు అందజేశారు. మోతాదుకు మించిన తీసుకున్న మందుల వల్లే సునంద మృతి చెందారని ఎయిమ్స్ (ఏఐఐఎంఎస్)వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. సునంద శరీరంపై 12 గాయాలున్నాయని, అయితే అవి ప్రాణాంతకమైనవి కావని వైద్యులు తెలిపారు.

 సునంద పుష్కర్ ఈ నెల 17న ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. 2010లో  శశి థరూర్  సునందను పెళ్లి చేసుకున్నారు. సునంద మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. వైద్యుల నివేదికతో ఆమె మోతాదుకు మించి మందు తీసుకున్నందువల్ల చనిపోయినట్లు నిర్ధారణ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement