డిప్యూటీ సీఎంపై ఏసీబీ దర్యాప్తు షురూ | delhi acb starts investigation on deputy chief minister manish sisodia | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎంపై ఏసీబీ దర్యాప్తు షురూ

Oct 1 2015 10:12 AM | Updated on Aug 17 2018 12:56 PM

డిప్యూటీ సీఎంపై ఏసీబీ దర్యాప్తు షురూ - Sakshi

డిప్యూటీ సీఎంపై ఏసీబీ దర్యాప్తు షురూ

అరవింద్ కేజ్రీవాల్ సర్కారుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులోని ఉప ముఖ్యమంత్రి మీద అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ప్రారంభించింది.

అరవింద్ కేజ్రీవాల్ సర్కారుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న కాక మొన్న భార్యపై హత్యాయత్నం కేసులో మాజీ మంత్రి సోమనాథ్ భారతి అరెస్టు కాగా, ఇప్పుడు ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులోని ఉప ముఖ్యమంత్రి మీదే అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ప్రారంభించింది.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మనీష్ సిసోదియా.. ప్రభుత్వ ప్రకటనల కాంట్రాక్టులను తన సమీప బంధువులకే ఇప్పించారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై తమకు ఫిర్యాదులు కూడా అందాయని ఢిల్లీ ఏసీబీ చీఫ్ ఎంకే మీనా తెలిపారు. ఈ వ్యహారంపై తాము దర్యాప్తు చేస్తున్నామని, సమాచార ప్రచార శాఖ డైరెక్టరేట్కు కూడా నోటీసులు ఇచ్చామని మీనా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement