అతనితో నాకు పిల్లలు కూడా ఉన్నారు: దీపిక | Deepika Padukone comments on Vin Diesel | Sakshi
Sakshi News home page

అతనితో నాకు పిల్లలు కూడా ఉన్నారు: దీపిక

Jan 18 2017 5:24 PM | Updated on Sep 5 2017 1:32 AM

అతనితో నాకు పిల్లలు కూడా ఉన్నారు: దీపిక

అతనితో నాకు పిల్లలు కూడా ఉన్నారు: దీపిక

’ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ సినిమాతో హాలీవుడ్‌లో అదరిపోయే ఎంట్రీ ఇచ్చింది దీపిక పదుకొనే.

’ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ సినిమాతో హాలీవుడ్‌లో అదరిపోయే ఎంట్రీ ఇచ్చింది దీపిక పదుకొనే. ఇప్పటికే దేశంలో విడుదలైన ఈ సినిమా త్వరలోనే ప్రపం‍చవ్యాప్తంగా ప్రేక్షకులను పలుకరించబోతున్నది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో హీరో విన్‌ డీజిల్‌ తో కలిసి బిజీగా ఉన్న దీపిక ప్రఖ్యాత టీవీ షో ఎలెన్‌ డిజెనరస్‌ షోలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

’ట్రిపుల్‌ ఎక్స్‌’లో తన సహ నటుడు, హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ విన్‌ డీజిల్‌ పట్ల తనకెంతో క్రష్‌ ఉందని వెల్లడించింది. అంతేకాదు అతనితో ముద్దుముద్దుగా ఉన్న పిల్లల్ని కూడా కన్నట్టు పేర్కొంది. అయితే, నిజజీవితంలో కాదు తన ఊహాల్లో అని ట్విస్టు ఇచ్చింది. ’ట్రిపుల్‌ఎక్స్‌’ సినిమాలో దీపిక, విన్‌ డీజిల్‌ మధ్య కెమెస్ట్రీ బాగా పండిందని, దీనివెనుక సీక్రెట్‌ ఏమిటి? మీ మధ్య రొమాన్స్‌ ఏమైనా ఉందా? అని టీవీషో వ్యాఖ్యాత ఎలెన్‌ డిజెనరస్‌ అడిగింది.

దీపిక బదులిస్తూ.. ’నిప్పు లేనిది పొగ రాదు కదా! కానీ ఇదంతా నా ఊహల్లోనే.. మేం కలిసి ఉన్నట్టు, మా మధ్య కెమెస్ట్రీ ఉన్నట్టు నాలో నాకు అనిపిస్తుంది. మేం కలిసి జీవించినట్టు.. మాకు అద్భుతమైన పిల్లలు కూడా పుట్టినట్టు అనిపిస్తుంది. ఇదంతా నా ఊహల్లోనే’ అంటూ దీపిక పేర్కొంది. హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న దీపిక.. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో ప్రేమలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్‌ కోసం భారత పర్యటనకు వచ్చిన విన్‌ డీజిల్‌ కూడా దీపిక బాయ్‌ఫ్రెండ్‌ రణ్‌వీర్‌ సింగేనని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement