xXx: Return of Xander Cage
-
వెయ్యి కోట్ల క్లబ్లో దీపిక
బాలీవుడ్ హాట్ బ్యూటి దీపిక పదుకొనే రికార్డ్ సృష్టించింది. దీపిక హీరోయిన్గా నటించిన చాలా సినిమాలు ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో సందడి చేయగా, తాజాగా ఈ భామ వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలో భాగమయ్యింది. అయితే దీపిక ఈ రికార్డ్ సృష్టించింది ఇండియన్ సినిమాతో కాదు. తొలిసారిగా హాలీవుడ్లో నటించిన ట్రిపులెక్స్ : రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ సినిమాతో ఈ ఫీట్ సాధించింది. హాలీవుడ్ యాక్షన్ స్టార్ విన్ డీజిల్, నినా డోబ్రేవ్, రూబీ రోజ్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు డిజె కరుసో దర్శకుడు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇండియాలోనూ మంచి విజయం సాధించింది. భారత్‌లో 53 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ట్రిపులెక్స్, ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్లతో సత్తా చాటింది. త్వరలో చైనాలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ట్రిపులెక్స్ : రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్, మరిన్ని రికార్డ్ లు సాధించే దిశగా దూసుకుపోతోంది. -
అతనితో నాకు పిల్లలు కూడా ఉన్నారు: దీపిక
’ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాతో హాలీవుడ్లో అదరిపోయే ఎంట్రీ ఇచ్చింది దీపిక పదుకొనే. ఇప్పటికే దేశంలో విడుదలైన ఈ సినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలుకరించబోతున్నది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో హీరో విన్ డీజిల్ తో కలిసి బిజీగా ఉన్న దీపిక ప్రఖ్యాత టీవీ షో ఎలెన్ డిజెనరస్ షోలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ’ట్రిపుల్ ఎక్స్’లో తన సహ నటుడు, హాలీవుడ్ సూపర్‌స్టార్ విన్ డీజిల్ పట్ల తనకెంతో క్రష్ ఉందని వెల్లడించింది. అంతేకాదు అతనితో ముద్దుముద్దుగా ఉన్న పిల్లల్ని కూడా కన్నట్టు పేర్కొంది. అయితే, నిజజీవితంలో కాదు తన ఊహాల్లో అని ట్విస్టు ఇచ్చింది. ’ట్రిపుల్ఎక్స్’ సినిమాలో దీపిక, విన్ డీజిల్ మధ్య కెమెస్ట్రీ బాగా పండిందని, దీనివెనుక సీక్రెట్ ఏమిటి? మీ మధ్య రొమాన్స్ ఏమైనా ఉందా? అని టీవీషో వ్యాఖ్యాత ఎలెన్ డిజెనరస్ అడిగింది. దీపిక బదులిస్తూ.. ’నిప్పు లేనిది పొగ రాదు కదా! కానీ ఇదంతా నా ఊహల్లోనే.. మేం కలిసి ఉన్నట్టు, మా మధ్య కెమెస్ట్రీ ఉన్నట్టు నాలో నాకు అనిపిస్తుంది. మేం కలిసి జీవించినట్టు.. మాకు అద్భుతమైన పిల్లలు కూడా పుట్టినట్టు అనిపిస్తుంది. ఇదంతా నా ఊహల్లోనే’ అంటూ దీపిక పేర్కొంది. హాలీవుడ్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న దీపిక.. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో ప్రేమలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్ కోసం భారత పర్యటనకు వచ్చిన విన్ డీజిల్ కూడా దీపిక బాయ్‌ఫ్రెండ్ రణ్వీర్ సింగేనని స్పష్టం చేశారు. -
ఆ వారం రోజులు ఒళ్లంతా నొప్పులే: దీపిక
హాలీవుడ్ సినిమా ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ ది జండర్ కేజ్‌లో నటించిన భారతీయ నటి దీపికా పదుకొనే తన మూవీ ప్రమోషన్లో భాగంగా ట్విట్టర్లో అభిమానుల ప్రశ్నలకు జవాబులిచ్చింది. సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలు తనకు సవాలుగా నిలిచాయన్న దీపిక, ప్రతి సీక్వెన్స్ తర్వాత దాదాపు వారం రోజుల పాటు ఒళ్లు నొప్పులు వేధించేవని తెలిపింది. అయితే, అదృష్టవశాత్తు షూటింగ్ మొత్తంలో తనకు మాత్రం ఒక్క గాయం కూడా కాలేదని అభిమానులకు చెప్పింది. విన్ డీజిల్, రూబీ రోజ్, నైనా డెబ్రేవ్, టోనీ కొల్టే, శ్యాముల్ జాక్సన్ లాంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రం జనవరి 14న దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం హీరో విన్ డీజిల్, దర్శకుడు డీజే కరుసో సినిమా ప్రమోషన్లో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ముంబైలో గురువారం నిర్వహించిన ప్రీమియర్‌కు అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భగా హీరో విన్ డీజిల్‌ను దీపిక పొగడ్తలతో ముంచెత్తింది. విన్ అందగాడు, మంచి మనస్సున్న వాడంటూ ఆకాశానికెత్తేసింది. కరుసో అయితే భారతదేశంలోనే ఉండిపోవాలనుకుంటున్నాడని, ఇక్కడ మరింత కాలం ఉండి ఈ అనుభూతులు ఆస్వాదించాలన్నది అతడి కల అని చెప్పింది. నీర్జా, పింక్, ఏ దిల్ హై ముష్కిల్, కపూర్ అండ్ సన్స్ తనకు ఈ ఏడాదిలో నచ్చిన సినిమాలని మరో అభిమానికి ట్విట్టర్ ద్వారా దీపిక సమాధానమిచ్చింది. -
డిజిల్ హల్చల్.. దద్దరిల్లిన థియేటర్
ముంబై: ప్రపంచంలోని అందరు హీరోల్లోకి డిఫరెంట్‌గా, నున్నటి బోడి గుండునే తన ట్రెండ్ మార్క్‌గా ట్రెండ్ సెట్ చేశాడు హాలీవుడ్ టాప్ యాక్షన్ హీరో విన్ డిజిల్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొన్‌తో కలిసి ఆయన నటించిన ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్’ సినిమా ప్రమోషన్ కోసం మొట్టమొదటిసారి ఇండియాకు వచ్చిన డిజల్‌కు ఘన స్వాగతం లభించింది. చిత్ర యూనిట్‌తో కలిసి గురువారం ఉదయం ముంబైకి వచ్చిన డిజిల్.. సాయంత్రం జరిగిన ట్రిపుల్ ఎక్స్ ప్రీమియర్ షోలో హల్చల్ చేశారు. తెల్లటి లుంగీ కట్టి.. బాలీవుడ్ హిట్ నంబర్ ‘లుంగీ డ్యాన్స్’కు లయబద్ధంగా స్టెప్పులు వేశారు. దీపిక కూడా లుంగీ కట్టి, అతనితో జత కట్టింది. ఇక చూడాలి, థియేటర్ దద్దరిల్లేలా ఒకటే ఈలలు వేస్తూ గోల చేశారు అభిమానులు! ప్రపంచ వ్యాప్తంగా జనవరి 20న విడుదల కానున్న ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్’.. ఇండియాలో మాత్రం జనవరి 14నే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా జనవరి 17 లేదా 20న విడుదల కావాల్సిఉన్నా, సంక్రాంతి నేపథ్యంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ వెర్షన్లలో రిలీజ్ చేస్తే భారీ వసూళ్లు రాబట్టవచ్చన్న ఆలోచనతోనే సినిమా విడుదల ప్రీ పోన్ చేసినట్లు తెలిసింది. దీపిక కూడా దక్షిణాది అమ్మాయే కావడం మరో సానుకూలాంశం. గురువారం అట్టహాసంగా జరిగిన ప్రీమియర్ షోకు ఈ సినిమా దర్శకుడు డీజె కరుసోతోపాటు బాలీవుడ్ స్టార్లు రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్, కల్కి కొచ్చిన్, నీల్ నితీష్ ముకేష్, ఇర్ఫాన్ ఖాన్, హుమా ఖురేషీ, కృతి సనన్ , రిచా చద్దా తదితరులు హాజరయ్యారు. (విన్ డిసిల్ తండ్రి ఎవరో తెలియదు!) -
దీపిక హాలీవుడ్ ట్రైలర్ వచ్చేసింది
బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొనే హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ట్రిపులెక్స్ : రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్. హాలీవుడ్ యాక్షన్ స్టార్ విన్ డీసెల్ లీడ్ రోల్లోనటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పూర్తి యాక్షన్ సీన్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్లో దీపిక కొన్ని క్షణాలు పాటు కనువిందు చేసింది. బాలీవుడ్లో గ్లామర్ డాల్‌గా ఆకట్టుకున్న ఈ భామ హాలీవుడ్లో మాత్రం యాక్షన్ స్టార్‌గా ఎంట్రీ ఇస్తోంది. డిజె కరుసో దర్శకత్వంలో వన్ రేస్ ఫిలింస్, రెవల్యూషన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విన్ డీసెల్, దీపికా పదుకొనేలతో పాటు టోనిజా, డానీ ఎన్, నిక్కీ జాం లాంటి హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2017 జనవరి 17న రిలీజ్ అవుతోంది. -
రెండ్రోజుల ముందే దీపికను చూస్తారా?