డిజిల్‌ హల్‌చల్‌.. దద్దరిల్లిన థియేటర్‌ | Deepika's 'lungi dance' with Vin Diesel | Sakshi
Sakshi News home page

డిజిల్‌ హల్‌చల్‌.. దద్దరిల్లిన థియేటర్‌

Jan 13 2017 9:31 AM | Updated on Sep 5 2017 1:11 AM

ప్రపంచంలోని అందరు హీరోల్లోకి డిఫరెంట్‌గా, నున్నటి బోడి గుండునే తన ట్రెండ్‌ మార్క్‌గా ట్రెండ్‌ సెట్‌ చేశాడు.. మొట్టమొదటిసారి ఇండియాకు వచ్చి..


ముంబై:
ప్రపంచంలోని అందరు హీరోల్లోకి డిఫరెంట్‌గా, నున్నటి బోడి గుండునే తన ట్రెండ్‌ మార్క్‌గా ట్రెండ్‌ సెట్‌ చేశాడు హాలీవుడ్‌ టాప్‌ యాక్షన్‌ హీరో విన్‌ డిజిల్‌. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొన్‌తో కలిసి ఆయన నటించిన ‘ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేగ్‌’ సినిమా ప్రమోషన్‌ కోసం మొట్టమొదటిసారి ఇండియాకు వచ్చిన డిజల్‌కు ఘన స్వాగతం లభించింది. చిత్ర యూనిట్‌తో కలిసి గురువారం ఉదయం ముంబైకి వచ్చిన డిజిల్‌.. సాయంత్రం జరిగిన ట్రిపుల్‌ ఎక్స్‌  ప్రీమియర్‌ షోలో హల్‌చల్‌ చేశారు.

తెల్లటి లుంగీ కట్టి.. బాలీవుడ్‌ హిట్‌ నంబర్‌ ‘లుంగీ డ్యాన్స్‌’కు లయబద్ధంగా స్టెప్పులు వేశారు. దీపిక కూడా లుంగీ కట్టి, అతనితో జత కట్టింది. ఇక చూడాలి, థియేటర్‌ దద్దరిల్లేలా ఒకటే ఈలలు వేస్తూ గోల చేశారు అభిమానులు! ప్రపంచ వ్యాప్తంగా జనవరి 20న విడుదల కానున్న ‘ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేగ్‌’.. ఇండియాలో మాత్రం జనవరి 14నే ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిజానికి ఈ సినిమా జనవరి 17 లేదా 20న విడుదల కావాల్సిఉన్నా, సంక్రాంతి నేపథ్యంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ వెర్షన్లలో రిలీజ్‌ చేస్తే భారీ వసూళ్లు రాబట్టవచ్చన్న ఆలోచనతోనే సినిమా విడుదల ప్రీ పోన్‌ చేసినట్లు తెలిసింది. దీపిక కూడా దక్షిణాది అమ్మాయే కావడం మరో సానుకూలాంశం. గురువారం అట్టహాసంగా జరిగిన ప్రీమియర్‌ షోకు ఈ సినిమా దర్శకుడు డీజె కరుసోతోపాటు బాలీవుడ్‌ స్టార్లు రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్, కల్కి కొచ్చిన్, నీల్ నితీష్ ముకేష్, ఇర్ఫాన్ ఖాన్, హుమా ఖురేషీ, కృతి సనన్ , రిచా చద్దా తదితరులు హాజరయ్యారు. (విన్‌ డిసిల్‌ తండ్రి ఎవరో తెలియదు!)











Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement