హెరిటేజ్ స్టోర్పై బాంబుదాడి! | Crude bomb thrown at heritage store at chennai | Sakshi
Sakshi News home page

హెరిటేజ్ స్టోర్పై బాంబుదాడి!

Apr 13 2015 12:15 PM | Updated on Sep 3 2017 12:15 AM

శేషాచలం ఎన్కౌంటర్ మంటలు ఇంకా తమిళనాడులో చల్లారలేదు. తాజాగా చెన్నై నగరంలోని హెరిటేజ్ దుకాణంపై గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు.

శేషాచలం ఎన్కౌంటర్ మంటలు ఇంకా తమిళనాడులో చల్లారలేదు. తాజాగా చెన్నై నగరంలోని హెరిటేజ్ దుకాణంపై గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు.

తమిళ అనుకూల సంఘానికి చెందిన నలుగురు వ్యక్తులను ఈ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన చిత్తూరు జిల్లా శేషాచలం ప్రాంతంలో 20 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడు భగ్గుమంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement