breaking news
heritage store
-
బూజుపట్టిన బాదం మిల్క్.. హెరిటేజ్ స్టోర్ మూసివేత
సాక్షి, రామాయంపేట(మెదక్): బూజుపట్టిన బాదం మిల్క్ బాటిల్‌ను విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామాయంపేటలోని హెరిటేజ్ స్టోర్‌ను శుక్రవారం రాత్రి మున్సిపల్ అధికారులు మూసివేయించారు. వినియోగదారుడు స్టాల్లో బాదం మిల్క్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి బాటిల్ మూత ఓపెన్ చేయగా దుర్వాసన వచ్చింది. ఈ విషయాన్ని వినియోగదారుడు మున్సిపల్ అధికారుల దృష్టికి తెచ్చాడు. దీంతో అధికారులు బాటిల్‌ను స్వాధీనం చేసుకొని హెరిటేజ్ స్టాల్‌ను మూసివేయించారు. ఈ విషయంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉదయ్‌కిరణ్ తెలిపారు. చదవండి: తెలుగు అకాడమీ కేసులో కీలక మలుపు.. ఏసీబీకి బదిలీ -
హెరిటేజ్ స్టోర్‌పై బాంబుదాడి!
శేషాచలం ఎన్కౌంటర్ మంటలు ఇంకా తమిళనాడులో చల్లారలేదు. తాజాగా చెన్నై నగరంలోని హెరిటేజ్ దుకాణంపై గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. తమిళ అనుకూల సంఘానికి చెందిన నలుగురు వ్యక్తులను ఈ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన చిత్తూరు జిల్లా శేషాచలం ప్రాంతంలో 20 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడు భగ్గుమంటోంది.