సుప్రీంకోర్టుకు ఎక్కిన ధోనీ | cricketer ms dhoni moves supreme court over two issues | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టుకు ఎక్కిన ధోనీ

Sep 10 2015 6:49 PM | Updated on Sep 2 2018 5:24 PM

సుప్రీంకోర్టుకు ఎక్కిన ధోనీ - Sakshi

సుప్రీంకోర్టుకు ఎక్కిన ధోనీ

జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బిజినెస్ టుడే పత్రికలో తన ఫొటోను విష్ణువుగా చిత్రీకరిస్తూ వేసిన కవర్ పేజీ ఫొటో విషయంలో తలెత్తిన వివాదాన్ని సుప్రీం దృష్టికి ధోనీ తీసుకెళ్లాడు. ఈ మేరకు గురువారం ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశాడు. 2013 సంవత్సరంలో జరిగిన ఈ ఘటనపై ధోనీ అప్పట్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అలాగే, బెంగళూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై పెండింగులో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దుచేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించడంతో ఆ అంశంపై కూడా ధోనీ సుప్రీంకోర్టులో మరో ఎస్ఎల్పీ దాఖలు చేశాడు.  ఈ కేసును ఈనెల 14వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement