తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం వల్ల దేశంలో మరిన్ని ఉద్యమాలు తలెత్తుతాయని ఇంటెలిజెన్స్ బ్యూరో అధినేత ఆసిఫ్ ఇబ్రహీం చెబుతున్నారు.
ఎవరెన్ని చెప్పినా వినకుండా.. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రాన్ని నిలువునా చీల్చేయడానికి గొడ్డళ్లు పట్టుకుని సిద్ధమైపోతుంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో అధినేత ఆసిఫ్ ఇబ్రహీం మాత్రం ఇది సరికాదనే చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం వల్ల దేశంలో మరిన్ని ఉద్యమాలు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. దీనివల్ల భద్రతా సంస్థలకు సరికొత్త సవాళ్లు ఎదురవుతాయన్నారు.
వివిధ రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన ప్రతిపాదన వల్ల రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా నిఘా సంస్థలకు చాలా సమస్యలు తలెత్తాయని ఆసిఫ్ ఇబ్రహీం అన్నారు. ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రారంభించారు.