కరెన్సీ కట్టలపై కామ్రేడ్! | CPI(M) leader's bed of cash | Sakshi
Sakshi News home page

కరెన్సీ కట్టలపై కామ్రేడ్!

Oct 20 2013 4:16 AM | Updated on Aug 13 2018 8:10 PM

కరెన్సీ కట్టలపై కామ్రేడ్! - Sakshi

కరెన్సీ కట్టలపై కామ్రేడ్!

ఆయనో కమ్యూనిస్టు నాయకుడు. కాంట్రాక్టరు.

అగర్తల: ఆయనో కమ్యూనిస్టు నాయకుడు. కాంట్రాక్టరు. నోట్ల కట్టలను పరుపులా పరచి దానిపై నిద్రపోవాలని ఎన్నో రోజుల నుంచీ ఓ కోరిక. ఎట్టకేలకు తీర్చేసుకోవాలనుకున్నాడు. బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. నోట్లను ఇంట్లో పరిచి హాయిగా కునుకు తీశాడు. సెల్‌ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకుని ముచ్చటపడ్డాడు కూడా. కానీ ఆ దృశ్యాలు గురువారం టీవీ చానల్లో ప్రత్యక్షం కావడంతో ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. త్రిపురలోని జోగేంద్రనగర్ సీపీఎం కమిటీ సభ్యుడైన సమర్ ఆచార్జీ.. సొంత పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించీ పార్టీ ఆగ్రహానికి గురయ్యారు.

 

మిగతా పార్టీ నేతల్లా తాను వంచకుడిని కాదని, వారు  సంపదను పోగేసుకున్నారంటూ ఆచార్జీ చేసిన  విమర్శలూ టీవీలో ప్రసారం కావడంతో దుమారం రేగింది. దీనిపై  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బిజన్  మాట్లాడుతూ.. పార్టీ తరఫున దర్యాప్తు పూర్తయిందని, ఆచార్జీ స్వయంగా మొబైల్‌లో తీసుకున్న వీడియో దృశ్యాలు ఆయన స్నేహితుడి ద్వారా టీవీ చానెల్‌కు అందాయన్నారు. పార్టీలో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement