ములాయంపై కేసు నమోదు చేయండి | Court orders filing of FIR against Mulayam | Sakshi
Sakshi News home page

ములాయంపై కేసు నమోదు చేయండి

Sep 16 2015 4:45 PM | Updated on Oct 5 2018 9:09 PM

ములాయంపై కేసు నమోదు చేయండి - Sakshi

ములాయంపై కేసు నమోదు చేయండి

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై కేసు నమోదు చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది.

లక్నో: సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై కేసు నమోదు చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది. ఐజీ ర్యాంకు అధికారి అమిత్ థాకూర్ ను బెదిరించారన్న ఆరోపణలపై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. పెను వివాదానికి దారి తీసిన ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.

అమిత్ థాకూర్ పిటిషన్ ను సెక్షన్156(3) కింద విచారణకు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్  సోమప్రభ స్వీకరించారు. ములాయంపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టాలని హజ్రత్ జంగ్ ఎస్ హెచ్ఓను ఆదేశించారు. దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సూచించింది. ములాయంపై కేసు నమోదు చేసేందుకు యూపీ పోలీసులు నిరాకరించడంతో అమిత్ థాకూర్ కోర్టును ఆశ్రయించారు. తనను ములాయం ఫోన్లో బెదిరించారని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement