
ఆ టీవీలో వికృతపర్వం మళ్లీ మొదలు..
ప్రఖ్యాత బ్రిటిష్ టీవీ.. చానెల్ 4లో వికృతపర్వం మళ్లీ మొదలైంది.
లండన్: ప్రఖ్యాత బ్రిటిష్ టీవీ.. చానెల్ 4లో వికృతపర్వం మళ్లీ మొదలైంది. ఇప్పటివరకు టీవీల్లో ప్రసారమైనవాటిలో అత్యంత చెత్త కార్యక్రమంగా విమర్శలపాలైన ‘నేకెడ్ అట్రాక్షన్’ రెండో సిరీస్‌ను చానెల్4 గురువారం అధికారికంగా ప్రసారం చేసింది.
డేటింగ్ షోగా అభివర్ణించే ఈ కార్యక్రమంలో పోటీదారులను స్టేజ్‌పై నగ్నంగా నిలబెట్టించి పలురకాల ప్రశ్నలు వేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ తర్వాత జంట డేటింగ్ చేయడం, వారి అనుభవాల వివరణ తంతును ఎపిసొడ్లుగా విభజించి ప్రసారం చేస్తారు. చానెల్ 4లో గత ఏడాది జులై 25న నేకెడ్ అట్రాక్షన్ మొదటి సిరీస్ ప్రారంభమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
అయితే, ఇండిపెండెంట్ బ్రాడ్‌కాస్టింగ్ అథారిటీ కలిగి ఉన్నందున టీవీ ప్రసారల నిలిపివేత సాధ్యంకాలేదు. ఆ విధంగా చానెల్ 4 తన హక్కులను మరోసారి దుర్వినియోగం చేస్తూ వికృత ప్రసారాలను పునఃప్రారంభించింది. జర్నలిస్ట్, రచయిత్రి అన్నా రిచర్డ్‌సన్ ఈ ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేస్తున్నారు. కాగా, గతంలో ఘాటుగా స్పందించిన నెటిజన్లు ఈ డేటింగ్ షో రెండో సిరీస్‌పై భిన్నంగా కామెంట్లు చేయడం గమనార్హం.