dating show
-
అప్పుడు తాగి ఉన్నాను, బలవంతంగా ముద్దుపెట్టాడన్న కంటెస్టెంట్
బుల్లితెరపై ఎన్ని షోలు ఉన్నా రియాలిటీ షోలకున్న క్రేజే వేరు. బిగ్‌బాస్, లాకప్.. ఇవన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకున్న ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్ కొత్త రియాలిటీ షోను ప్రవేశపెట్టింది. అదే 'ఇన్ రియల్ లవ్'. షో పేరు చూస్తేనే అర్థమైపోతుంది ఇదొక డేటింగ్ రియాలిటీ షో అని! ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు ప్రేమను వెతుక్కుంటారు. తమకు జోడీగా ఉన్నవారిని కనెక్షన్‌గా పిలుస్తారు. ఆన్లైన్ డేటింగ్‌కు, ఆఫ్‌లైన్ డేటింగ్‌కు మధ్య వ్యత్యాసాన్ని చూపే ప్రయత్నం చేస్తోందీ షో. ఈ షోకు రణ్విజయ్ సింఘ, గౌహర్ ఖాన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్గా ఓ ఎపిసోడ్లో కంటెస్టెంట్ సాక్షి గుప్తా తన కనెక్షన్ వీరేంద్రతో డేట్‌కు వెళ్లింది. ఈ క్రమంలో పూటుగా తాగిన వీరు స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడారు. ఆ సమయంలో వీరేంద్ర ఆమె భుజంపై ముద్దు పెట్టాడు. కానీ తాగిన మత్తులో వీరేంద్ర చర్యను సాక్షి అంతగా గమనించలేదట. కనీసం గుర్తు కూడా లేదట. మత్తు దిగిన తర్వాత వీరేంద్ర చేసిన పని అర్థమై ఆగ్రహం వ్యక్తం చేసింది కంటెస్టెంట్ 'కొన్నిసార్లు నువ్వు బలవంతం చేస్తున్నావు. నువ్వు చేసేది తప్పు. ఏ పని చేసినా ఇద్దరికీ అంగీకారంగా ఉంటే మంచిది. నిన్ను నా ప్రియుడిగా అంగీకరించినప్పుడు మాత్రమే నీకు నాపై అధికారం ఉంటుంది. అప్పుడు మాత్రమే నన్ను ముద్దు పెట్టుకునే హక్కు ఉంటుంది. లేని పక్షంలో నీకు నామీద ఎటువంటి హక్కు ఉండదు' అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయం గురించి తోటి కంటెస్టెంట్ దగ్గర సాక్షి మాట్లాడుతూ.. 'వీరేంద్ర నాకు ఏం జరిగిందో చెప్పాడు. పూల్‌లో నేనసలు కంట్రోల్లోనే లేను. అప్పుడతడు నా భుజంపై ముద్దు పెట్టాడట. నాకా విషయం కూడా గుర్తు లేదు. కానీ అలా చేయడం నాకసలు నచ్చలేదు' అని చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి వీరేంద్ర స్పందిస్తూ.. 'నువ్వు తాగిన మత్తులో ఉన్నావా? లేదా? అనేది పక్కనపెడితే ఆ సమయంలో నీ బాడీ లాంగ్వేజ్ నా చర్యను ఇష్టపడ్డట్లుగానే ఉంది. కానీ ఇప్పుడేమో సడన్‌గా మాట మార్చి నన్ను బ్లేమ్ చేస్తున్నావు. నేను అంత చెడ్డవాడిలా కనిపిస్తున్నానా?' అని ఎదురుదాడి చేశాడు. వీరి మధ్య ప్రేమకు బదులు కోపతాపాలే కనిపించడంతో షోలో వీరి కనెక్షన్ ముగిసింది. View this post on Instagram A post shared by Sakshi Gupta (@thesakshiguptaa) -
ఆ టీవీలో వికృతపర్వం మళ్లీ మొదలు..
లండన్: ప్రఖ్యాత బ్రిటిష్ టీవీ.. చానెల్ 4లో వికృతపర్వం మళ్లీ మొదలైంది. ఇప్పటివరకు టీవీల్లో ప్రసారమైనవాటిలో అత్యంత చెత్త కార్యక్రమంగా విమర్శలపాలైన ‘నేకెడ్ అట్రాక్షన్’ రెండో సిరీస్‌ను చానెల్4 గురువారం అధికారికంగా ప్రసారం చేసింది. డేటింగ్ షోగా అభివర్ణించే ఈ కార్యక్రమంలో పోటీదారులను స్టేజ్‌పై నగ్నంగా నిలబెట్టించి పలురకాల ప్రశ్నలు వేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ తర్వాత జంట డేటింగ్ చేయడం, వారి అనుభవాల వివరణ తంతును ఎపిసొడ్లుగా విభజించి ప్రసారం చేస్తారు. చానెల్ 4లో గత ఏడాది జులై 25న నేకెడ్ అట్రాక్షన్ మొదటి సిరీస్ ప్రారంభమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, ఇండిపెండెంట్ బ్రాడ్‌కాస్టింగ్ అథారిటీ కలిగి ఉన్నందున టీవీ ప్రసారల నిలిపివేత సాధ్యంకాలేదు. ఆ విధంగా చానెల్ 4 తన హక్కులను మరోసారి దుర్వినియోగం చేస్తూ వికృత ప్రసారాలను పునఃప్రారంభించింది. జర్నలిస్ట్, రచయిత్రి అన్నా రిచర్డ్సన్ ఈ ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేస్తున్నారు. కాగా, గతంలో ఘాటుగా స్పందించిన నెటిజన్లు ఈ డేటింగ్ షో రెండో సిరీస్‌పై భిన్నంగా కామెంట్లు చేయడం గమనార్హం.